బాల‌య్య ఖాతాలో మ‌రో ఫేడ‌వుట్ హీరోయిన్

నంద‌మూరి బాల‌కృష్ణ- బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఇద్ద‌రుహీరోయిన్లుంటారు. బ‌డ్జెట్ ప‌రిమితుల దృష్ట్యా ఇద్ద‌రినీ కొత్త వాళ్ల‌నే తీసుకోవాల‌ని చిత్ర‌బృందం ముందే నిర్ణ‌యించుకుంది. తొలి హీరోయిన్ గా మల‌యాళం నుంచి ప్ర‌యాగ మార్టిన్ ని ఎంచుకున్నారు. రెండో హీరోయిన్ గా పూర్ణ‌ని తీసుకున్న‌ట్టు టాక్.

పూర్ణ‌ని తెలుగు చిత్ర‌సీమ మ‌ర్చిపోయి చాలా కాలం అయ్యింది. సినిమా అవ‌కాశాల్లేక టీవీ షోల‌కు ప‌రిమిత‌మైపోయింది. అలాంటి పూర్ణ‌కు బాల‌య్య సినిమాలో ఛాన్స్ రావ‌డం… ఆశ్చ‌ర్య‌క‌ర‌మే. బాల‌య్య నిర్ణ‌యాలు ఎప్పుడూ ఇలానే ఉంటాయి. ఫేడ‌వుట్ అయిపోయి, అయిపోతున్న‌వాళ్ల‌ని ఆద‌రించ‌డం, వాళ్ల‌కు అవ‌కాశాలు ఇవ్వ‌డం బాల‌య్య స్టైల్‌. కాక‌పోతే.. ఇలా రీ ఎంట్రీ ఇచ్చిన క‌థానాయిక‌లు రాణించిన దాఖ‌లాలు కూడా లేవు. బాల‌య్య సినిమా చేశాన‌ని తృప్తి ప‌డిపోవ‌డం మిన‌హాయిస్తే. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close