గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ పొత్తు ఎవరితో..!?

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. అన్ని పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ తాయిలాలు ప్రకటించేసి.. పంపిణీ చేసి.. రెడీ అయిపోయింది. ఇక బీజేపీ సన్నాహాలను గ్రౌండ్ లెవల్లో చేసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ జవసత్వాలు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే.. టీడీపీలో అంతో ఇంతో బలంగా ఉన్న పార్టీగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీ పరిస్థితి మాత్రం అంచనా వేయలేకుండా ఉంది. బల్దియా ఎన్నికల్లో ఒకప్పుడు మేయర్ స్థానాన్ని కూడా గెల్చుకున్న పార్టీ టీడీపీ. గత గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కనిపించడంతో ఒక్కటంటే ఒక్క కార్పొరేటర్ సీటునే దక్కింది. కానీ 2009లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీది నెంబర్ టూ స్థానం. 45 కార్పొరేటర్ సీట్లను గెల్చుకుంది.

హైదరాబాద్‌లో చాలా కాలంగా పార్టీ క్యాడర్ నిద్రాణంగా ఉంది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ పెద్దగా పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టలేదు. కానీ గ్రేటర్‌లోని ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం కార్యకలాపాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇతర పార్టీల్లో సీట్లు దక్కవనుకున్నా కొంత మంది సీనియర్లు మళ్లీ.. టీడీపీ గూటికి చేరుతున్నారు., ఇటీవలి కాలంలో ఈ చేరికలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో ఉన్నట్లుగా పరిస్థితి ఉండదని.. టీఆర్ఎస్ పరిస్థితి ఏమంత బాగోలేదని .. గ్రేటర్‌లో ప్రజల ఇబ్బందులు తీరలేదని… ఇది ప్రజల్లో స్పష్టం గా కనిపిస్తోందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. పోటీకి డివిజిన్ల వారీగా టీడీపీ నేతలు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు కూడా.. గ్రేటర్‌లో పోటీ విషయంలో క్లారిటీ ఇచ్చారు. టీడీపీ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ క్యాడర్‌ను ఆదేశించారు. అంటే పోటీ ఖాయమని అంచనా వేసుకోవచ్చు. టీడీపీ పోటీ చేస్తే.. ప్రధాన ప్రత్యర్థిగా ఉండలేకపోవచ్చు కానీ.. ఎక్కడిక్కడ నాయకుల బలం తోడైతే…ప్రాధాన్య క్రమంలో ఓట్లు.. సీట్లు గెల్చుకునే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. అందుకే ఇప్పుడు.. కొన్ని పార్టీలు.. టీడీపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నాయన్న చర్చ జరుగుతోంది. టీడీపీ పొత్తుతో వెళ్తుందా..లేకపోతే ఒంటరిగానే బరిలోకి దిగుతుందా.. అన్నది వేచి చూడాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడపలో వైఎస్ ఓటు బ్యాంక్ చెరో ఓటు ట్రెండ్ – అవినాష్ పుట్టి మునిగినట్లే !

కడపలో అవినాష్ రెడ్డి పుట్టి మునగడం ఖాయంగా కనిపిస్తోంది. కడపలో వైఎస్ కుటుంబాన్ని వ్యతిరేకించేవారు ఎవరూ ఆ కుటుంబానికి ఓటేసే అవకాశం లేదు. వైఎస్ కుటుంబాన్ని అభిమానించేవారు మాత్రం ఈ...

మంగళగిరిలో ఓటుకు నాలుగు వేలు..!?

కుప్పం.. మంగళగిరి.. పిఠాపురం.. ఈ మూడు నియోజకవర్గాలపై వైసీపీ ప్రధానంగా ఫోకస్ చేస్తోంది. కారణం అక్కడ చంద్రబాబు, లోకేష్ , పవన్ కళ్యాణ్ లు పోటీ చేస్తుండటమే. దీంతో వారిని ఎలాగైనా ఓడించాలని...

సజ్జల భార్గవ, వైసీపీ సోషల్ మీడియా టీంపై సీఐడీ కేసులు !

ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారంటే ఏంటో వైసీపీ సోషల్ మీడియా, వాటి ఇంచార్జ్ సజ్జల భార్గవను చూస్తే అర్థమైపోతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీపై కేసులు...

ఢిల్లీ హైకోర్టులో కవితకు ఊరట దక్కేనా..?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించడంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close