‘ఉప్పెన‌’కు క్లైమాక్స్ టెన్ష‌న్‌?

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం `ఉప్పెన‌`. శిష్యుడిదే సినిమా అయినా.. అన్ని విష‌యాల్లోనూ క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు సుకుమార్‌. ఈ సినిమా నిర్మాణంలోనూ ఆయ‌న‌కు వాటా వుంది. ఈ సినిమా అవుట్ పుట్ పై సుకుమార్ పూర్తి న‌మ్మ‌కంతో ఉన్నారు. కాక‌పోతే.. క్లైమాక్స్ విష‌యంలో ఆయ‌నతో పాటు మైత్రీ మూవీస్ కూడా టెన్ష‌న్ ప‌డుతున్న‌ట్టు టాక్.

ఈ సినిమా క‌థ సుఖాంతం కాదు. కాస్త విషాద భ‌రిత‌మైన ముగింపు అని తెలుస్తోంది. ఇలాంటి యాంటీ క్లైమాక్స్‌లు మ‌నకు అంత‌గా న‌ప్ప‌వు. యాంటీ క్లైమాక్స్ లు ఉన్న సినిమాల్ని తెలుగు వాళ్లు కూడా అంత‌గా ఆద‌రించ‌లేదు. కానీ..త‌మిళ జ‌నాల‌కు మాత్రం బాగా నచ్చుతాయి. ఈ సినిమా అక్క‌డా విడుద‌ల అవుతోంది. కాబ‌ట్టి.. క్లైమాక్స్ త‌మిళ ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చుతుంద‌ని చిత్ర‌బృందం ధీమాగా ఉంది. తెలుగులోనే ఎలాంటి రిజ‌ల్ట్ వ‌స్తుందా? అని డౌటు ప‌డుతున్నారు. ఈ సినిమాని సుకుమార్ ఇప్ప‌టికే ఇండ్ర‌స్ట్రీలోని త‌న కు అత్యంత స‌న్నిహితుల‌కు చూపించాడ‌ని, వాళ్ల ఫీడ్ బ్యాక్ తీసుకునే ప్ర‌య‌త్నం చేశాడ‌ని టాక్‌. వాళ్లంతా క్లైమాక్స్ కాస్త మారిస్తే బాగుంటుందేమో అన్న స‌ల‌హా ఇచ్చారని తెలుస్తోంది. కానీ.. ఈ క‌థ‌కు అయువు ప‌ట్టు అనుకుంటుంద‌న్న‌దే అది. అదే మార్చేస్తే… ఈసినిమాని ఏ ఉద్దేశ్యంతో తీశామో అది మిస్స‌యిపోతుంద‌ని సుకుమార్ భావిస్తున్నాడు. క్లైమాక్స్ మార్చ‌మ‌ని ఎంత‌మంది ఎన్ని ర‌కాలుగా చెప్పినా అటు సుకుమార్ గానీ, ఇటు బుచ్చిబాబు కానీ ఒప్పుకోవ‌డం లేద‌ట‌. సుకుమార్ ఆర్డ‌రేస్తే.. బుజ్జిబాబు పాటిస్తాడు. కానీ.. సుకుమార్‌కి సైతం.. ఈ క్లైమాక్స్ పై న‌మ్మ‌కం ఉంది. కానీ మైత్రీ మూవీస్‌నిర్మాత‌లే… క్లైమాక్స్ ఏం చేస్తుందో అని.. టెన్ష‌న్ ప‌డుతున్నార్ట‌. క్లైమాక్స్ గ‌నుక‌… న‌చ్చితే.. ఈ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంలో ఢోకా ఉండ‌ద‌ని, అటూ ఇటూ అయితే.. మొద‌టికే మోసం వ‌స్తుందేమో అని కాస్త కంగారు ప‌డుతున్నారు. `ఉప్పెన‌` ఫ‌లితం.. ఆ సినిమా క్లైమాక్స్ పై ఆధార‌ప‌డి ఉంద‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close