ఇక ఏపీలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు రావు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కింద.. వైద్య చికిత్సల కోసం చేసే సాయాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. దీనికి కారణం ఆరోగ్యశ్రీ సేవలను విస్తరించడమే. ఏపీ సర్కార్ ఇటీవల ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2434 జబ్బులకు చికిత్స అందించేలా విస్తరించారు. దాదాపుగా మనుషులకు వచ్చే అన్ని రోగాలకు ఆరోగ్యశ్రీలోనే చికిత్స చేయిస్తున్నందున.. ఇక ప్రత్యేకంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సాయం చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వ పెద్దలు భావించారు. అందుకే ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చే చికిత్స ఖర్చుల రీఇంబర్స్మెంట్ దరఖాస్తులను స్వీకరించొద్దని ప్రజాప్రతినిధులకు సీఎం కార్యాలయం సూచనలు చేసింది.

డిసెంబర్  ఒకటో తేదీ నుంచి ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న రోగాల చికిత్సకు సంబంధించిన  క్లెయిములు సీఎం సహాయనిధి కింద స్వీకరించబోమని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చే జబ్బులకు నెట్ వర్క్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునేలా ప్రజలకు అర్థమయ్యేలా అవగాహన కల్పించాలని ప్రజా ప్రతినిధులను సీఎంవో కోరింది. ఆరోగ్య శ్రీ పరిధిలోకి రాని సీఎంఆర్ఎఫ్ క్లైములు దరఖాస్తులు ప్రజా ప్రతినిధుల పీఏలు మాత్రమే పంపాలని సీఎంవో కోరింది. ప్రభుత్వ నిర్ణయం ఓ రకంగా.. పేద ప్రజలకు మాత్రమే కాదు.. పార్టీ నేతలకు కూడా శరాఘాతమే అవుతుంది.

సీఎంఆర్ఎఫ్ ద్వారా నియోజకవర్గ ప్రజలకు ఆర్థిక సాయం అందించడం ద్వారా.. వైసీపీ నేతలు.. ఎంతో మందికి మేలు చేసి.. పార్టీకి ఫ్యాన్స్‌గా మారుస్తూ ఉంటారు. అనూహ్యమైన అనారోగ్య సమస్యలు.. పెద్ద ఎత్తున ఖర్చయ్యే రోగాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులు ఇలాంటి వారికి చుక్కలు చూపిస్తూ ఉంటాయి. మెరుగైన వైద్యం అందిస్తారో లేదోనన్న భయం కూడా ఉంటుంది. అందుకే చాలా మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో చూపించుకుని … ఆ మేరకు ఆర్థిక సాయం కోసం .. సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకుంటారు. ఇప్పుడా అవకాశం పోవడం వల్ల క్యాడర్ నుంచి వచ్చే ఒత్తిడికి వైసీపీ ఎమ్మెల్యేలు ఇబ్బందిపడాల్సి రావొచ్చు.

సీఎంఆర్ఎఫ్ లో నిధులు ఎటు పోతున్నాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఫేక్ చెక్కుల కేసు ఇంత వరకూ తేలలేదు. ఎంత మంది ఎన్ని ఫేక్ చెక్కులు వేశారో స్పష్టత లేకుండా పోయింది. సింపుల్‌గా చేధించాల్సిన కేసుల్ని కూడా పోలీసులు చేధించలేకపోతున్నారు. ఓ ఎమ్మెల్యే కార్యాలయంలో పని చేసే వారిపై తీవ్ర ఆరోపణలు వచ్చినా… కేసులో పురోగతి లేకపోవడం.. ఇప్పుడు.. సీఎంఆర్ఎఫ్ చెక్కుల సాయాన్ని నిలిపివేయడం వంటివి వైసీపీకి ఇబ్బందికరంగా మారుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌ల్కి.. క‌మ‌ల్.. కంశుడు!

ప్ర‌భాస్ అభిమానులే కాదు, ఇండియ‌న్ సినిమా మొత్తం ఆశ‌గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్.. 'క‌ల్కి'. ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాలు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌,...

దర్శి రివ్యూ : హోరాహోరీ – కానీ బూచేపల్లికి ఎన్నో మైనస్‌లు !

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రెండే మున్సిపాలిటీల్లో ఒకటి దర్శి. రెండోది తాడిపత్రి. తాడిపత్రిలోనూ కష్టం మీద గెలిచారు కానీ దర్శిలో మాత్రం టీడీపీ స్వీప్ చేసింది. నిజానికి అక్కడ నాయకుడు...

గత ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వాళ్లేరి ?

అధికార అహంకారం జగన్మోహన్ రెడ్డిని అందరికీ దూరం చేసింది. తాను ఎవరి సాయంతో అధికారం అందుకున్నారో .. వాళ్లందర్నీ అవమానించి , వేధించడంతో దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ...

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close