అభిజిత్‌ను గెలిపించి బిగ్ బాస్ నిర్వాహకులు ఆ తప్పు చేస్తారా!

Sravan Babu, Freelance Journalist

బిగ్ బాస్ – 4లో ఫైనల్‌కు చేరుకునే టాప్ 3 కంటెస్టెంట్‌లలో ఖచ్చితంగా అభిజిత్ ఉంటాడనటంలో ప్రేక్షకులు ఎవరికీ ఎలాంటి సందేహమూ లేదు. అతనే విన్నర్ అవుతాడనే వర్గాలు కూడా బలంగానే ఉన్నాయి… బిగ్ బాస్ – 2లో కౌశల్ మందాకు లాగానే ఇతనిని విపరీతంగా సపోర్ట్ చేస్తున్న గ్రూపులు కొన్ని సోషల్ మీడియాలో తీవ్రంగా హల్‌చల్ చేస్తున్న నేపథ్యంలో. అయితే అతను విన్నర్ కావటానికి ఒక్క విషయం మాత్రం బలంగా అడ్డుపడుతుందనే వాదనకూడా మరోవైపు బలంగా వినిపిస్తోంది.

ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్‌లు అందరిలోనూ అభిజిత్‌కు అదనపు అడ్వాంటేజ్‌లు ఉన్నాయనే విషయం ఎవరూ కాదనలేరు. అతని గుడ్ లుక్స్, రెండు-మూడు సినిమాలు(లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్…)లో పూర్తిస్థాయి హీరో పాత్ర పోషించి ఉండటం, అదీ హోస్ట్ నాగార్జున భార్య అమలకు కొడుకు పాత్రలో నటించటం, ఒకటో, రెండో వెబ్ సిరీస్‌లలో నటించి ఉండటం… ఇవన్నీ ప్లస్ పాయింట్సే. 32 ఏళ్ళ అభిజిత్‌కు మరో అడ్వాంటేజ్ కూడా ఉంది. అమ్మ రాజశేఖర్, గంగవ్వ, కరాటే కళ్యాణి మొదలైన సీనియర్ బ్యాచ్ తప్పించి, చివరికి మిగిలిన యూత్ బ్యాచ్‌లో ఇతనే పెద్దవాడుకావటంతో వాళ్ళకంటే ఎక్కువ ఉండే అనుభవం, పరిణతి కూడా ఇతనికి ప్లస్ పాయింటేనని చెప్పుకోవాలి.

అయితే అతను తనకున్న అడ్వాంటేజ్‌లను చక్కగా వినియోగించుకోలేదని అనిపిస్తుంది. మొత్తం సీజన్‌లో టాస్క్‌లలో ఎక్కడా చురుకుగా పాల్గోకుండా, ప్యాసివ్‌గా ఉంటుంటాడు. తనకు భుజానికి సర్జరీ జరిగిందనే కారణాన్ని చెబుతుంటాడు(తనకు కళ్ళకు కూడా ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్లుంది. గత ఆదివారంనాడు ఒక టాస్క్‌లో – బాటిల్‌ లోపల ఏ కలర్ ఉందో చెప్పమని నాగార్జున అడిగితే తనకు అలాంటివి కనబడవని అభి అన్నాడు). తాను cut above అనో, ఇక్కడ ఉండాల్సిన వాడిని కాననో అన్నట్లుగా ఫండా చూపిస్తుంటాడు. ఒకానొక సమయంలో జరిగిన వాదనలో తాను బాగా ఎడ్యుకేటెడ్ అని చెప్పటం, ఇంగ్లీష్‌లో మాట్లాడొద్దని పదే పదే చెప్పినా, తన సుపీరియారిటీ చూపించటంకోసం ఇంగ్లీష్‌లో మాట్లాడటం చేస్తుంటాడు. హోస్ట్ నాగార్జున అతను చేసిన ఇలాంటి పలు తప్పులను ఎత్తి చూపినప్పుడు అభిజిత్ సారీలు చెప్పటం మొదట పదివారాలలో దాదాపు ప్రతి వారంలోనూ జరిగింది. అసలు బిగ్ బాస్ హౌస్‌కు కప్ గెలవటంకోసం కాదని, కేవలం అనుభవంకోసమే వచ్చానని తానే స్వయంగా చెప్పాడు. కొద్దిమంది హౌస్ సభ్యులతో తప్పిస్తే మిగిలినవారికి దూరంగా ఉంటాడు, ఒక మూల కూర్చుని ఉంటాడు.

తన సినీ కెరీర్‌ పెద్దగా ముందుకు సాగకపోవటం అభిజిత్‌లో ఫ్రస్ట్రేషన్ ఉండి ఉండొచ్చని అనిపిస్తుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో అతనికంటే చిన్నపాత్రలలో నటించిన విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి మంచి విజయాలను చేజిక్కించుకుని టాలీవుడ్‌లో తమదైన ముద్ర వేసుకునిఉండటం, తన కెరీర్ చతికిలబడిపోవటం ఆ ఫ్రస్ట్రేషన్‌కు కారణాలు అని స్పష్టంగా తెలుస్తోంది. అందుకే అభిజిత్ తండ్రి బిగ్ బాస్ స్టేజిమీదకు వచ్చినపుడు – ఈ షో నీ కమ్ బ్యాక్‌కు సాయపుడుతుందని చెప్పటం దానిని రుజువు చేస్తోంది.

అయితే వీక్ డేస్‌లో sober గా కూర్చుని ఉండే అభిజిత్, వీకెండ్స్ శని, ఆది వారాలలో నాగార్జున వచ్చినప్పుడుమాత్రం హ్యాపీ ఫేస్ పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తుంటాడు. అతనికి బట్టరింగ్ చేయాలని ప్రయత్నిస్తుంటాడు. నాగార్జునే స్వయంగా దీనిపై అభికి పలుసార్లు చురకలు అంటించారు. వీక్ డేస్‌లో అభి చేసిన తప్పులను నాగ్ అడిగినప్పుడు నవ్వులు చిందిస్తూ, తనకేమీ తెలియదని, ఇంటిలోని సభ్యులు చౌకబారు మనుషులని, చౌకబారు ఆరోపణలు చేస్తున్నారన్నట్లుగా బిల్డప్ ఇస్తుంటాడు. హౌస్ మొత్తంలో కల్మషంలేని వ్యక్తిగా పేరు తెచ్చుకున్న సొహైల్‌‌ను, గ్రామీణ తెలంగాణ భాషలో మాట్లాడినందుకు తప్పుబట్టటంకూడా చాలామందికి అభిపై చిరాకు కలుగజేసింది. అందుకనే ఇంటి సభ్యులు అతనిని ఎక్కువగా నామినేట్ చేస్తుంటారు.

ఇక ప్రస్తుతానికొస్తే, రేటింగ్స్ పరంగా అభిజిత్ మిగిలిన అందరు కంటెస్టెంట్స్ కంటే ముందు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఆ రేటింగ్స్ ఎంతవరకు ఒరిజినల్ అనేది అందరికీ డౌటే! కౌశల్ మందా విషయంలో బిగ్ బాస్ రేటింగ్స్ నవ్వులపాలైన సంగతి తెలిసిందే. ఈసారికూడా అదే పునరావృతమవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, టాస్కులు ఏమాత్రం ఆడని కంటెస్టెంట్‌ను గెలిపిస్తే బిగ్ బాస్ కాన్సెప్టుకే పూర్తి విరుద్ధం కనుక ప్రజలలోకి తప్పుడు సంకేతాలు వెళతాయనే వాదనకూడా బలంగా వినబడుతోంది. మరి నిర్వాహకులు ఈసారి ఆ తప్పు చేస్తారా, లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close