టీఆర్ఎస్‌ను మించి కాంగ్రెస్ మేనిఫెస్టో ..!

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 20వేల లీటర్ల మంచినీరు ఉచితం అని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ తానేం తక్కువ తినలేదని.. తాము 30వేల లీటర్లు ఇస్తామని హామీ ఇచ్చేసింది. గ్రేటర్ కాంగ్రెస్ మేనిఫెస్టోను.. పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ హామీల్లో ఎక్కడా తగ్గలేదు. బీజేపీ, టీఆర్ఎస్ ఇద్దర్నీ కలిపి దాటేయాలని ప్రయత్నించింది. టీఆర్ఎస్ రూ. పదివేల సాయాన్ని ఎన్నికలు అయిపోయిన వెంటనే చేస్తామని చెబుతోంది. బీజేపీ ఈ సాయం పాతిక వేలుగా ప్రకటించింది. కానీ.. కాంగ్రెస్ పార్టీ మరింత ముందుకెళ్లింది ఏకంగా యాభై వేల సాంయ ప్రకటించేసింది. ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ.2.5 లక్షల నుంచి 5 లక్షలు, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ. 25 లక్షలు సాయం చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చేశారు.

ఇక ఎంఎంటీఎస్‌, మెట్రోల్లో దివ్యాంగులు, మహిళలకు ఉచిత ప్రయాణం హామీ కూడా ఉంది. మెట్రో సేవలు పాతబస్తీ నుంచి ఎయిర్‌పోర్టు వరకు పొడిగించడం.. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్పించడం.. కార్పొరేట్‌ విద్యా సంస్థలల్లో ఫీజులను నియంత్రించడం లాంటి హామీలు కూడా ఉన్నాయి. 100 యూనిట్లలోపు గృహవినియోగదారులకు విద్యుత్ రాయితీ ప్రకటించారు. వరదల కష్టాలను దృష్టిలో పెట్టుకుని వరద రహిత హైదరాబాద్ కోసం జపాన్, జర్మనీ టెక్నాలజీ తీసుకొస్తామన్నారు. అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇచ్చి.. 80 గజాలలోపు ఉన్న భూముల్లో ఇల్లు కట్టుకున్నవారికి ఆస్తి పన్ను రద్దు చేస్తామన్నారు. ఎల్ఆర్ఎస్‌, బీఆర్ఎస్‌ లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు.

రాజకీయ పార్టీల హామీలు.. ఒకరు ఒకటి అంటే.. మరొకరు రెండు అంటున్నారు. కానీ నిధులు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తారో మాత్రం చెప్పడం లేదు. అటు టీఆర్ఎస్ అయినా.. ఇటు బీజేపీ అయినా… కాంగ్రెస్ అయినా అదే పరిస్థితి. రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, బీజేపీ నేతలు.. నిధుల విషయంలో తలోమాట చెబుతున్నారు. అసలు కాంగ్రెస్ ఎక్కడి నుంచి తెస్తుందో చెప్పడానికి చాన్స్ లేదు. జరుగుతోందని అసెంబ్లీ ఎన్నికలన్నట్లుగా అన్ని రకాల హామీలు ఇచ్చేస్తున్నారు. వాటిని ప్రజలు ఎంత వరకూ నమ్ముతారన్నదాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close