వాలంటీర్లను ఎందుకు తీసేస్తున్నారు..!?

ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత తెచ్చిన విప్లవాత్మక మార్పుల్లో ఒకటి వాలంటీర్లు. వారిని ఇప్పుడు పెద్ద ఎత్తున తీసేయమని ఆదేశాలు ఇచ్చారు. వాలంటీర్లలో పద్దెనిమిది ఏళ్ల లోపు వాళ్లు.. .35 ఏళ్లు దాటిన వాళ్లు ఉంటే వాళ్లని తక్షణం తీసేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల ప్రకారం గ్రామ, వార్డు వలంటీర్లుగా 18-35 ఏళ్ల మధ్యనున్న వారినే నియమించాలి. అయితే వాలంటీర్ల నియామకం సమయంలో ఇలాంటివేమీ పట్టించుకోలేదు. వైసీపీ నేతలు ఎవర్ని సిఫారసు చేస్తే వారినే నియమించారు. దాంతో వయసు.. చదువు లాంటివి పట్టించుకోలేదు. వారితోనే ప్రభుత్వానికి సంబంధించిన ప్రతీ సర్వేను.. పథకాల వివరాలను నమోదు చేయిస్తున్నారు. అయితే ప్రభుత్వం హఠాత్తుగా వయసు నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది.

వలంటీర్ల విషయంలో ప్రభుత్వ తాజా నిర్మయంతో ప్రతి జిల్లాలోనూ వేల సంఖ్యలో గ్రామ, వార్డు వలంటీర్లు విధులకు దూరమయ్యే అకాశం ఉంది. నియమించేటప్పుడు.. వారికి వయసు ఎక్కువ, తక్కువ అన్న విషయం తెలియదా..అన్న సందేహం చాలా మందిలో వస్తుంది. నిజానికి.. రికార్డుల పరంగా.. అనేక రకాలైన నిబంధనలతో వాలంటీర్లను నియమించారు. నియామకాల సమయంలో కోర్టుల్లో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. అయితే.. ప్రభుత్వం అన్నీ నిబంధనల ప్రకారం చేస్తున్నామని చెప్పింది. అయితే ఇప్పుడు.. సగం మందికిపై వాలంటీర్లకు అర్హతలు లేవని.. విమర్శలు వస్తున్నాయి. దీనిపై కొంత మంది కోర్టును ఆశ్రయిస్తారన్న ప్రచారం జరగడంతో ప్రభుత్వం ముందస్తుగా … అలాంటి వారిని తొలగించాలన్న నిర్ణయం తీసుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వాలంటీర్లకు ప్రభుత్వ నిధులను .. జీతాలుగా చెల్లింస్తున్నారు. సీఎఫ్ఎంఎస్ ద్వారా జీతాల చెల్లింపులు కావడంతో అన్నీ నిబంధనల ప్రకారం ఉండాలి. లేకపోతే.. అధికారులు ఇరుక్కుపోతారు. ఈ విషయంలో సమర్థించుకునే చాన్స్ కూడా ఉండదు. దీంతో.. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో వయసు నిబంధన పక్కాగా అమలు చేసి.. అర్హతలేని వారిని తొలగించాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. పరోక్షంగా అయినా ప్రభుత్వం ఇదే విషయాన్ని జీవోలో వెల్లడించింది. నిబంధనలకు విరుద్దంగా కొందరు వలంటీర్ల నియామకం జరిగిందని ఈమేరకు ఫిర్యాదులు వస్తున్నాయని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వన్స్ మోర్ ‘సుచి లీక్స్’: ఈసారి ధనుష్, జీవీ ప్రకాష్

సినిమా వార్తలని ఫాలో అయ్యేవారికి సుచీ లీక్స్ గురించి పరిచయం అవసరం లేదు. 'సుచీ లీక్స్‌' పేరుతో కోలీవుడ్‌లో దుమారం రేపారు సింగర్‌ సుచిత్ర. అప్పట్లో ఆమె నుంచి వచ్చిన...

పుష్ప ఇంపాక్ట్.. బన్నీ ఫుల్ క్లారిటీ

సినిమా ప్రభావం ఖచ్చితంగా సమాజంపై వుంటుందని కొందరి అభిప్రాయం. సమాజంలో ఉన్నదే సినిమాలో ప్రతిబింబిస్తుందని మరికొందరి మాట. సినిమాని సినిమాగా చుస్తారానినేది ఇంకొందరి వాదన. హీరో అల్లు అర్జున్ కూడా ఇదే అభిప్రాయాన్ని...

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు… ఆందోళనలో కవిత అభిమానులు..?

అత్యంత భద్రత నడుమ ఉండే తీహార్ జైలుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. జైలును పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు. ఆగంతకుల...

రేవంత్ సర్కార్ కు టైం ఫిక్స్ చేసిన బీజేపీ..!?

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ను కూల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా..? ఇందుకోసం ముహూర్తం కూడా ఫిక్స్ అయిందా..? కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రేవంత్ సీఎం పీఠం మున్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోనుందా..?అంటే వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close