ఏపీ సర్కార్‌లో మహిళా ఐఏఎస్‌ల కోల్డ్ వార్..!

ఏదైనా యూనివర్శిటీకి వెళ్లి చట్టాలు చదువుకుని రా..!.. అని కోపం వస్తే.. తోటి ఐఏఎస్‌ను ఉద్దేశించి..మరో ఐఏఎస్ ఏవరైనా ప్రైవేటుగా వ్యాఖ్యలు చేస్తారేమో కానీ.. ఏకంగా జీవో జారీ చేస్తారా..? చేయరు. అలా చేశారంటే.. తట్టుకోలేనంత కోపం ఉందని అనుకోవాలి. ఇప్పుడు.. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శిగా ఉన్న వాణీ మోహన్‌ విషయంలో సీఎస్ నీలం సహాని ఇలాంటి జీవోనే జారీ చేశారు. “ఏదైనా యూనివర్సిటీకి వెళ్లి సీఆర్పీసీ నిబంధనలపై కచ్చితంగా ఒక రిఫ్రెషర్‌ కోర్సు చేయాలి. తద్వారా ఆమె తన పనితీరును, నైపుణ్యాన్ని పెంచుకోవాలి” అని జీవోలోనే చెప్పారు.

తెర వెనుక ఏం జరిగిందో కానీ.. తెర ముందు ముందు.. మాత్రం.. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శిగా ఉన్న వాణీ మోహన్‌ గతంలో ఓ తప్పు చేశారు. అంతకు ముందు ఆమె సర్వే సెటిల్మెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో కొన్ని భూముల విషయంలో ఆమె తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమయింది. విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఆమె తప్పు చేశారు కానీ అవినీతికి పాల్పడలేదని నివేదిక ఇచ్చారు. అయితే ఆ ఆరోపణల్ని తిరస్కరించాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తి ఆధారంగానే ఆమెపై సీఎస్ నీలం సహాని.. ఘాటైన పదాలతో జీవో జారీ చేశారు. ఇలాంటి తప్పులకు సాధారణంగా మెమోలు జారీ చేస్తారు. కానీ సహానీ మాత్రం ఏకంగా ఘాటైన పదాలతో జీవోనే జారీ చేసేశారు.

జూనియర్ అయినప్పటికీ.. తోటి ఐఏఎస్ అధికారి పట్ల నీలం సహాని ఇలా వ్యవహరించడానికి కారణం… ప్రస్తుతం.. వాణీ మోహన్ బాధ్యతలు నిర్వహిస్తున్న పదవే కారణమని భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో… ఎస్‌ఈసీకి… ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ఇందులో ప్రధానంగా సీఎస్ నిలం సహాని వివాదాస్పదం అవుతున్నారు. ఈ క్రమంలో ఆమె ఇచ్చిన జీవోలు వివాదాస్పదం అవుతున్నాయి. రాస్తున్న లేఖలు కోర్టు ఉల్లంఘనలన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ క్రమంలో.. ఎన్నికల సంఘం వద్ద కార్యదర్శిగా ఉండి.. సీఎస్ సూచనలను పాటించడం లేదన్న కోపంతో.. ఇలాంటి జీవో జారీ చేశారన్న చర్చ… సెక్రటేరియట్‌లో నడుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close