రెండో విడతకి రెండేళ్లు : కేసీఆర్ పాలనలో ఆ స్పార్కేది..!?

తెలంగాణ రాష్ట్రంలో రెండో సారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది. రెండేళ్ల కిందట ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించి డిసెంబర్ 13న రెండో సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ ఎక్కడా టీఆర్ఎస్‌లో సందడి కనిపించడం లేదు. అప్పట్లో ఉన్న ఉత్సాహం అస్సల్లేదు. గతంలో అయితే ఇలాంటి వార్షికోత్సవాలను పండుగలా చేసుకునేవారు. కొత్త సంక్షేమ పథకం ప్రకటించడమో… లేకపోతే.. పండుగలా అమలు చేయడమో చేసేవారు. ఇప్పుడు ఎలాంటి కార్యక్రమాలు లేవు. ఇంకా చెప్పాలంటే.. రెండేళ్లు అయిందనే సంగతిని గుర్తు చేసుకోవడానికి కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు అంత సిద్ధంగా లేరు.

మొదటి విడత టీఆర్ఎస్‌కు స్వర్ణయుగం..! మరి రెండోవిడత..?

మొదటి సారి సీఎం అయిన తర్వాత కేసీఆర్ హవా ఓ రేంజ్‌లో ఉంది. తెలంగాణ అంటే కేసీఆర్ అన్నట్లుగా రాజకీయం మార్చారు. రాజకీయ పునరేకీకరణ చేశారు. కాళేశ్వరం, భగీరథ వంటి ప్రాజెక్టులు… రైతు బంధు వంటి పథకాలతో తనదైన ముద్ర వేశారు. ఆ రోజుల్లో ఆయన ఉత్సాహం ఎలా ఉంటుందంటే… మరో మూడు టర్మ్ లు తెలంగాణలో టిఆర్ఎస్ దే అధికారం అని ఢంకా బజాయించి చెప్పేవారు. అయితే రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కడా లేని నిస్సత్తవు పాలనలో కనిపిస్తోంది. రాజకీయంగా లోక్ సభ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలింది. హైదరాబాద్ మినహా అన్ని సీట్లు గెల్చుకుందామంటే… బీజేపీ నాలుగు.. కాంగ్రెస్ మూడు సీట్లు గెలిచి సవాల్ విసిరాయి. కేసీఆర్ కుమార్తె కవిత ఓడిపోవడం అసలైన షాక్.

ఏకపక్ష ఎన్నికల రేంజ్ నుంచి ఎన్నికలంటే కంగారు పడే పరిస్థితికి..!

అప్పట్నుంటి టీఆర్ఎస్‌లో అదే నీరసం కనిపిస్తోంది. ఇక నుంచి గులాబీకి పూల బాట కాదని, రాబోయే మూడేళ్లూ ముళ్లదారిలో పయనించక తప్పదన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.దుబ్బాక ఫలితం తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారనే వాదనకు మరింత బలం పెరిగింది. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసినా… ప్రజలు బీజేపీలో ప్రతిపక్షం చూసుకుంటున్నారని గ్రేటర్ ఎన్నికలతో తేలిపోయింది. ఇప్పుడు టీఆర్ఎస్ ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ, మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం మునిసిపల్‌ కార్పొరేషన్‌ సహా పలు మునిసిపాలిటీ ఎన్నికలు జరగాల్సిఉంది. నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక కూడా వస్తోంది. మొదటి ఐదేళ్లు ఎన్నికలంటే ఏకపక్ష ఆట అనుకున్న టీఆర్ఎస్.. ఇప్పుడు ఉపఎన్నికలంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చేసింది.

ప్రజల్ని పట్టించుకోవడం ప్రారంభించకపోతే కష్టాలే..!

మొదటి విడతలో కేసీఆర్‌కు మంచి పేరు తెచ్చిన వాటిలో సంక్షేమ పథకాలు కీలకమైనవి. రెండో సారి సీఎంఅయ్యాక.. వాటి అమలులో కేసీఆర్ తడబడుతున్నారు. నిరుద్యోగ భృతి జాడే లేదు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణమే లేదు. స్థలం ఉంటే ఇంటికి ఐదు లక్షలు ఇస్తామని చెప్పినా.. దాని ఊసే లేదు. రుణమాఫీ, రెండో విడత గొర్రె పంపిణీ, హైదరాబాద్ లో కుల సంఘాలకు భవన నిర్మాణాలు, హైదరాబాద్ లో వరదలు, తెలంగాణలో రైతాంగం పంట నష్టపోతే పట్టించుకోకపోవడం లాంటివి కేసీఆర్ పై నమ్మకం కోల్పోయేలా చేస్తున్నాయి. చివరికి రైతు బంధు నిధులు కూడా పక్కాగా ఇవ్వలేకపోతున్నారు. దీనికి ఆర్థిక పరిస్థితే కారణం. కానీ కేసీఆర్ వైపే అందరూ చూస్తారు.

మొత్తానికి టీఆర్ఎస్‌కు ఇప్పుడే అసలైన సవాల్ ప్రారంభమయింది. రాజకీయ చాణక్యుడిగా పేరుపొందిన కేసీఆర్ ఈ సవాళ్లను అధిగమించి.. మరో మూడు టర్మ్ లు టీఆర్ఎస్‌దే అధికారం అని నిరూపించుకోవాల్సి ఉంది. దాని కోసం… చాలా చేయాల్సి ఉందని… తాజా పరిస్థితులు నిరూపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఫిక్స్ అయిపో..!?

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మనాభం అని కాకుండా పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటానని సవాల్ చేశారు. ముద్రగడ ధీమా ఏంటో...

నన్ను పట్టించుకోరా… ఓ తండ్రి అనూహ్య నిర్ణయం

కని పెంచిన కొడుకులు పట్టించుకోలేదని నిరాశ చెందిన ఓ తండ్రి అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. రెక్కల కష్టంతో పెంచిన కొడుకులు తనను పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో యావదాస్తిని కొండగట్టు ఆంజనేయ స్వామికి సమర్పించేందుకు...

డైరెక్ట‌ర్స్ డే… రాజ‌మౌళి ‘డాన్స్’ షో!

ద‌ర్శ‌క దిగ్గ‌జం దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌యంతిని పుర‌స్క‌రించుకొని, తెలుగు ద‌ర్శ‌కులంతా క‌లిసి 'డైరెక్ట‌ర్స్ డే'ని సెల‌బ్రేట్ చేసుకోబోతున్నారు. మే 4న ఈ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రగ‌బోతోంది. అందుకోసం ద‌ర్శ‌కులంతా క‌లిసి క‌స‌ర‌త్తులు చేస్తున్నారు....

ఏప్రిల్‌ బాక్సాఫీస్ రివ్యూ: అంతా చ‌ప్పచ‌ప్ప‌గా!

2024లో అప్పుడే 4 నెల‌లు గ‌డిచిపోయాయి. జ‌న‌వ‌రి సంక్రాంతి సినిమాల ద‌య వ‌ల్ల `ఓకే` అనిపించుకొంది. ఫిబ్ర‌వ‌రిలో అన్నీ ఫ్లాపులే. మార్చి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఓం భీమ్ భుష్‌, ప్రేమ‌లు, టిల్లూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close