ఎన్నికలు ఆపడానికి ఎన్నెన్ని నివేదికలో..!?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎక్కడా లేని కష్టం వచ్చింది. పంచాయతీ ఎన్నికలు పెట్టకూడదన్న లక్ష్యంతో.. చిత్రవిచిత్రమైన విన్యాసాలు చేస్తోంది. అదీ కూడా ఒకటి లేదా రెండు నెలల వాయిదా కోసం తంటాలు పడుతోంది. చివరికి కరోనా ప్రపంచాన్ని స్తంభింపచేసినప్పుడు.. కరోనా గిరోనా లేదని వాదించిన నోటితోనో… ఇప్పుడు ప్రపంచం మొత్తం టీకా న్యూస్ వస్తున్న సమయంలో … ఆ కరోనా డెడ్లీ.. ఎన్నికలు వద్దు అని కారణం చెప్పుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. తాజాగా.. ఏపీ సర్కార్‌కు వైద్య నిపుణులు ఓ నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక సిఫార్సులు ప్రకారం… జనవరితో ప్రారంభించి మార్చి వరకూ కరోనా సెకండ్ వేవ్ ఉంటుంది. అందుకే.. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆంక్షలు విధించాలి. అలాంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఎన్నికలు పెట్టడం కుదరదు.

ప్రభుత్వం ఇదే నివేదికను ఎన్నికల కమిషన్‌కు పంపింది. కరోనా సెకండ్ వేవ్ పొంచి ఉన్నందున.. ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టవద్దని చెప్పడం ఆ నివేదికను ఎన్నికల కమిషన్‌కు పంపిన ఉద్దేశం. మరోసారి ఈ నివేదికతో… హైకోర్టులో పిటిషన్లు వేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే.. ఏపీ సర్కార్ దూకుడు అలాగే ఉంది మరి. ఇప్పటికే కావాల్సిన అంశంలో అవసరమైన విధంగా నివేదికల్ని తెప్పించుకోవడంలో ఏపీ సర్కార్.. బోస్టన్ నుంచి హైపవర్ వరకు అనేక రకాల విన్యాసాలు ప్రదర్శించింది. ఇప్పుడు కూడా.. ఎన్నికల ఆపడానికి ఇలాంటి నివేదికల గేమే ఆడుతోందన్న అభిప్రాయం… విపక్ష పార్టీల నేతల్లో వినిపిస్తోంది.

ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోబోమని… హైకోర్టు స్పష్టం చేసింది. ఆపాలంటూ ఏపీ సర్కార్ వేసినపిటిషన్‌ను తిరస్కరించింది. ఇప్పుడు.. ఎస్ఈసీ ఎన్నికల ప్రక్రియను మరింత చురుగ్గా ప్రారంభించారు. సహకరించాల్సిందేనని తాజాగా లేఖ రాశారు. ఓటర్ల జాబితాను ఫైనల్ చేసే కసరత్తు కూడా ప్రారంభించారు. ప్రభుత్వానికి ఇష్టం లేదని అధికారులు ఎస్‌ఈసీ చెప్పినవి చేయకపోతే.. భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. చేయక తప్పదు. ఈ కారణంగా ప్రభుత్వం విన్యాసాలు ప్రదర్శిస్తోంది తంటాలు పడుతోంది.

ఇదంతా కూడా.. నిమ్మగడ్డ పదవీకాలం పూర్తయ్యే వరకే. పదవీ కాలం పూర్తయిన మరుసటి రోజే ఏపీలో కరోనా సెకండ్ వేవ్ పూర్తవుతుంది. ఎన్నికలు పెట్టే వాతావరణం వస్తుంది. ప్రభుత్వం నియమించిన ఎస్‌ఈసీ ఎన్నికలు నిర్వహిస్తారు. ఎవరు నిర్వహించినా ప్రజలు ఓట్లేయాలి. నిమ్మగడ్డలేకపోతే ప్రజలు ఓట్లేయకుండా ఏకగ్రీవాలుచేయవచ్చు. కానీ నిమ్మగడ్డ ఉంటే… ఏకగ్రీవాలు సాధ్యంకాదన్న ఆందోళనతోనే ప్రభుత్వం … ఆయన హయాంలో ఎన్నికలు నిర్వహించడం లేదన్న విమర్శలకు ప్రభుత్వ తీరే కారణం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క్రికెట్ మ్యాచ్‌లో ‘కుబేర‌’ స‌ర్‌ప్రైజ్‌

నాగార్జున మ‌న‌సు మ‌ల్టీస్టార‌ర్ల‌వైపు మ‌ళ్లింది. ఇప్పుడాయ‌న చేతిలో రెండు మ‌ల్టీస్టార‌ర్లు ఉన్నాయి. వాటిలో 'కుబేర‌' ఒక‌టి. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ధ‌నుష్ క‌థానాయ‌కుడు. ఇందులో నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్న...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని ఫోటో మాయం..కారణం అదేనా..?

ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమవ్వడం చర్చనీయాంశం అవుతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close