ఉద్యోగాల భర్తీ అంటే తెలంగాణ యువత నమ్మట్లేదేంటి..!?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఒకే సారి యాభైవేల ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆదివారం ఆదేశించారు. సోమవారం చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో అన్ని శాఖల సమావేశాలు జరిగాయి. ఖాళీలన్నీ గుర్తింపు ప్రారంభమయింది. పదవీ కాలం ముగిసిపోతున్న టీఎస్‌పీఎస్సీ చైర్మన్ పదవికి కొత్త వారిని నియమించారు. ఇలా ఓ వైపు ఉద్యోగాల భర్తీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి కానీ… తెలంగాణ యువతలో మాత్రం.. అంత నమ్మకం కలగడం లేదు. దానికి కారణం ఆరేళ్ల పాటు.. వివిధ సందర్భాల్లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలే. అసెంబ్లీలో కూడా.. ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకోవద్దని ఆయన నేరుగా చెప్పి ఎంతో కాలం కాలేదు. అలాంటిది ఇప్పుడు ఉద్యోగాలు భర్తీ చేస్తారంటే నమ్మలేకపోతున్నారు.

తెలంగాణ నిరుద్యోగుల అపనమ్మకానికి కారణం ఉంది. ప్రస్తుతం రెండు గ్రాడ్యూయేట్స్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వంపై యువత తీవ్ర ఆగ్రహం ఉందన్న విషయం ఆ పార్టీకి క్లారిటీ ఉంది. ఇప్పుడు యువతను కూల్ చేయాల్సి ఉంది. గతంలో.. యువత ఆగ్రహం వల్లనే.. గ్రాడ్యూయేట్స్ స్థానంలో టీఆర్ఎస్ నిలబెట్టిన ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్ రావు ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి రాంచంద్రరావు గెలిచారు. అలాగే జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయిన కాంగ్రెస్ నేత జీవన రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీగానే గెలిచి మండలికి వచ్చారు. అయితే అప్పట్లో టీఆర్ఎస్ ఫుల్ ఫామ్‌లో ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఒక్కో ఓటమి.. టీఆర్ఎస్ రేంజ్‌ను ఒక్కో మెట్టు దింపుతోంది. పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే.. యువత మొత్తం వ్యతిరేకంగా ఉందన్న భావనం నాటుకుపోతుంది. అదే జరిగితే.. టీఆర్ఎస్‌కు మరింత నష్టం.

ప్రతీ ఎన్నికకు ముందు.. కేసీఆర్ ఇలా తాయిలాలు ప్రకటించడం కామనే. ఆ తర్వాత అవి జరిగాయో.. అమలయ్యాయో లేదో పర్యవేక్షించేవారు కూడా ఉండరు. ఎన్నికలైపోయాయి కాబట్టి.. టీఆర్ఎస్ నేతలు కూడా లైట్ తీసుకుంటారు. అధికార పార్టీ కాబట్టి ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోలేరు. ఆ పరిస్థితే ఉద్యోగాల భర్తీలో కనిపిస్తోంది. తెలంగాణ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేస్తారన్న నమ్మకంతో… ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్లలో లక్షల మంది గడిపారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు… ఉద్యోగాల భర్తీ చేస్తామన్నా నమ్మలేకపోతున్నారు. నోటిఫికేషన్లు ఇచ్చినా.. ఏదో ఓ ఫిటింగ్ పెట్టి.. కోర్టు కేసుల్లో పడేలా చేస్తారని… కోర్టే అడ్డుకుందన్న ప్రచారం చేస్తారన్న అనుమానాలు కూడా… ఉద్యోగార్థుల్లో ఉన్నాయి. ఓ రాజకీయ పార్టీ నేతపై ఇలాంటి అభిప్రాయం ఏర్పడితే.. మళ్లీ నమ్మకం ఏర్పడేలా చేసుకోవడం కష్టమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close