విజయసాయి “ట్విట్టర్ టీకా”కు సోషల్ మీడియా షాకులు..!

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ను ఎప్పటి నుండి పంపిణీ చేస్తారో ఎవరికీ క్లారిటీ లేదు. కేంద్ర మంత్రులే జనవరి నుంచి ఉండొచ్చని చెబుతున్నారు. ఇంత వరకూ ఏ కంపెనీ వ్యాక్సిన్‌కూ అత్యవసర అనుమతులు ఇవ్వలేదు. అయితే.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కోటి మందికి వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసేసింది. అయితే.. ఈ విషయం ఎంపీ విజయసాయిరెడ్డికి మాత్రమే తెలిసింది. డిసెంబర్ 25 వ తేదీ నుంచి వ్యాక్సిన్ పంపిణీ చేయబోతున్నామని.. కరోనాపై ఏపీ సర్కార్ గెలిచేసిందని ప్రకటించేశారు. విజయసాయిరెడ్డి ట్వీట్‌తో సోషల్ మీడియా ఒక్క సారిగా భళ్లుమంది ఆయన ట్వీట్‌తో ఫుట్ బాల్ ఆడుకోవడం ప్రారంభించారు. దాంతో తానేం ట్వీట్ పెట్టారో ఆలస్యంగా గుర్తించిన విజయసాయిరెడ్డి ట్వీట్‌ను డిలీట్ చేశారు.

కానీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆయనను నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. ఏ కంపెనీ వ్యాక్సిన్ వేస్తారు అనే దగ్గర్నుంచి బ్లీచింగ్ బిళ్లల్ని వ్యాక్సిన్‌గా వేస్తున్నారా అనే సెటైర్ల వరకూ విమర్శలు..మీమ్స్.. పోస్టర్లతో హోరెత్తిస్తున్నారు. విజయసాయిరెడ్డి ట్వీట్లకు ఎప్పుడూ కౌంటర్ ఇచ్చే అయ్యన్నపాత్రుడు ఈ సారి ఉత్తరాంధ్ర యాసలో హిలేరియస్ కౌంటర్ ఇచ్చారు. “.. ఏటేటి వీసా రెడ్డి జగ్గడు కరోనా కి మందు కనిపెట్టేసినాడా?ఆ మందు నువ్వు డిసెంబర్ 25న కోటి మందికి పంచేస్తున్నావా? కొంపతీసి బ్లీచింగ్ బిల్లలుగా చేయించుకొని మింగావా? మతిపోయి మాట్లాడుతున్నావు. 6నెలల క్రితం చెప్పిన మూడు మాస్కులే ఇవ్వలేని జగ్గడు కరోనా వ్యాక్సిన్ తయారుచేసా అంటే నువ్వు ఎలా నమ్మావు వీసా…? అని ప్రశ్నించారు.

మరో టీడీపీ నేత, మాజీ మంత్రి కొత్తప్లలి జవహర్ కరోనా వ్యాక్సిన్ నీ అల్లుడు కంపెనీదా? లేక సూట్కేస్ కంపెనీదా? అని ప్రశ్నించారు. గాలి ప్రచారం చేయడంలో విజయసాయిరెడ్డి నెంబర్ వన్ అని మండిపడ్డారు. వ్యాక్సిన్ వేయాల్సి ఉన్న కారణంగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించలేమని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అదే సమయంలో విజయసాయిరెడ్డి ట్వీట్ కూడా అదే కోణంలో ఉండటంతో.. ఉత్తినే పెట్టలేదని.. ప్లాన్ ప్రకారం పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close