అభిజిత్‌కి అన్యాయం

బిగ్ బాస్ 4 విజేత‌గా నిలిచాడు అభిజిత్‌. చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీని అందుకున్నాడు. అయినా స‌రే.. అభిజిత్‌కి అన్యాయ‌మే జ‌రిగింద‌న్న‌ది బిగ్ బాస్ అభిమానుల వాద‌న‌. విజేత‌కు 50 లక్ష‌ల ప్రైజ్ మ‌నీ ప్ర‌క‌టించినా… చివ‌రికి 25 ల‌క్ష‌లే అందాయి. దానికి కార‌ణం… అందులోని 25 ల‌క్ష‌లు సోహైల్ ఆఫ‌ర్ రూపంలో అందుకున్నాడు. టాప్ 3 కంటెస్టెంట్లు ఉన్న‌ప్పుడు గోల్డెన్ సూట్ కేస్‌.. ఆఫ‌ర్ ఫ్రేమ్ లోకి వ‌చ్చింది. సూట్ కేస్ లో ఉన్న 25 ల‌క్ష‌ల‌తో ఎవ‌రైనా స‌రే, టాప్ 3 నుంచి త‌ప్పుకోవ‌చ్చ‌ని నాగ్ ఆఫ‌ర్ ఇస్తే.. మ‌రో మాట లేకుండా సోహైల్ దాన్ని అందుకుని బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. దాంతో సోహైల్ టాప్ 3కే ప‌రిమితం అయ్యాడు. అయినా స‌రే, 25 ల‌క్ష‌లు వ‌చ్చిన‌ట్టైంది. అయితే ఈ సొమ్ము… విన్న‌ర్‌కి ఇచ్చే క్యాష్ ప్రైజ్ నుంచి త‌గ్గించార‌న్న విష‌యం ఆ త‌ర‌వాత నాగ్ బ‌య‌ట‌పెట్టాడు. అంటే విజేత‌కూ.. 3 వ‌స్థానంలో నిలిచి సోహైల్‌కీ ఒక‌టే బ‌హుమ‌తి అన్న‌మాట‌.

బిగ్ బాస్ లో ఎవ‌రు ఎన్ని ఆఫ‌ర్లైనా ఇవ్వొచ్చు. అయితే.. ఆ డ‌బ్బుని విన్న‌ర్ కి ఇచ్చే క్యాష్ ప్రైజ్ నుంచి త‌గ్గించి ఇవ్వ‌డ‌మేమిటి? అన్న‌ది అంద‌రి వాద‌న‌. విజేత‌కి అందాల్సిన దాంట్లో కోత విధించే దానికి ఆఫ‌ర్ ఇవ్వ‌డ‌మేమిటి? సోహైల్‌కి 25 ల‌క్ష‌లు వ‌చ్చినా, చిరు-నాగ్ చెరో ప‌ది ల‌క్ష‌లు ప్ర‌కటించారు. అందులో 10 ల‌క్ష‌లు.. అనాథ ఆశ్ర‌మానికి వెళ్తాయి. మిగిలిన ప‌ది..లో సోహైల్‌, మెహ‌బూబ్ పంచుకుంటారు. అంటే… సోహైల్ కి మొత్తంగా 30 ల‌క్ష‌లు వ‌చ్చాయ‌న్న‌మాట‌. రెండో స్థానంలో నిలిచిన అఖిల్ కి ర‌న్న‌ర్ గా నిలిచాడ‌న్న సంతృప్తి త‌ప్ప ఇంకేం మిగ‌ల్లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close