తిరుపతిలో సైకిల్‌కి గాలి కొడుతున్న రాబిన్ శర్మ..!

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికకు టీడీపీ ముందస్తుగా పనులు చేసుకుంటోంది. వేరే కార్యకలాపాలేమీ లేకపోవడంతో చంద్రబాబు కూడా.. తిరుపతి ఉపఎన్నికకు సమయం కేటాయిస్తున్నారు. అయితే.. ఆయన ఈ ఎన్నిక బాధ్యతను ప్రధానంగా ఓ వ్యూహకర్తకు అప్పగించారు. ఆయనే రాబిన్ శర్మ. గతంలో పీకే టీంలో కీలకంగాపని చేసి… తర్వాత సొంత సంస్థ పెట్టుకున్నారు. టీడీపీతో ఒప్పందం చేసుకున్నారు. ఆయన పార్టీ స్ట్రాటజీని ఖరారు చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రచార వ్యూహాల్ని భిన్నంగా ఎంచుకుంటున్నారు. ఇప్పటికీ ఐటీడీపీ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించారు. అలాగే… ప్రత్యేకమైన యాప్ ను కూడా రూపొందించుకున్నారు.

రాబిన్ శర్మ కొద్ది రోజుల పాటు తిరుపతిలో మకాం వేసి… పరిస్థితులపై అవగాహన తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో ఐటీడీపీ ప్రచార సరళి ఎలా ఉండాలనే అంశంపై ఒక వ్యూహం సిద్ధం చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకొచ్చిన వైసీపీ పాలనా వైఫల్యాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లాలని టీడీపీ భావిస్తోంది. వీటితోపాటు చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ నేతల ఆగడాలు, చేస్తోన్న అన్యాయాలను కూడా సోషల్ మీడియా ద్వారా వైరల్ చేయాలని నిర్ణయించారు. టీటీడీ పవిత్రతను మంటగలిపే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరు, ఇసుక, లిక్కర్ మాఫియా దందా, దళితులు, మైనార్టీలపై దాడులు వంటి ప్రధాన అంశాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. రాబిన్ శర్మ టీం .. కొన్ని బృందాలను నియమించుకుంది. వారందరూ తిరుపతి చేరుకున్నారు. ఆ టీమ్ లు తమ పనిని ప్రారంభించాయి.

ఇప్పటికే పనబాక లక్ష్మి పేరును ఖరారు చేసిన చంద్రబాబు.. పార్టీ పరంగా క్షేత్ర స్థాయి వ్యూహాలను అమలు చేయడం ప్రారంభించారు. బూత్, మండల, అసెంబ్లీ, పార్లమెంట్ స్థాయిల్లో కమిటీలను నియమించారు. బూత్ స్థాయిలో 8 వేల మంది కార్యకర్తలను రంగంలోకి దించారు. గ్రామ స్థాయిలో వెయ్యి మంది తమ పని మొదలుపెట్టారు. మండలస్థాయిలో 40 మంది నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించారు. 89 మంది పరిశీలకులను నియమించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close