ఆలయాల విషయంలో జగన్ ని కాపాడబోయి బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి సెల్ఫ్ గోల్ ?

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ దేవాలయాల ధ్వంసం రాజకీయ రగడ ను సృష్టిస్తోంది. విజయనగరం రామతీర్థం లో ఆలయాల ధ్వంసాన్ని నిరసిస్తూ బిజెపి నేతలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. సమస్య రాజకీయ రంగు పులుముకోవడం తో ఇతర పార్టీల నేతలు కూడా రంగంలోకి దిగారు. తెలుగుదేశం నేతలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. చంద్రబాబు నాయుడు కూడా రామతీర్థం రానున్నాడు. వైఎస్ఆర్ సిపి నేతలు ర్యాలీలు నిర్వహిస్తూ చంద్రబాబే దీనికి కారణం అని బాబుపై నెపం నెట్టి వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. పైకి బిజెపి స్టాండ్ తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నా అంతర్గతంగా విష్ణువర్ధన్ రెడ్డి వైఎస్ఆర్సిపి ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ ట్వీట్ చదివిన నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వివరాల్లోకి వెళితే..

బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేస్తూ, “ఆలయాలు కూల్చడంలో మీకు మీరే సాటి
బాబు VS జగన్ . 5 జులై 2016 రోజు గుర్తు ఉందా @ncbn గారు? నాడు మీరు కూల్చింది.
బాబుగారు సియం గా40 ఆలయాలు.
జగన్ గారు సియం గా20 ఆలయాలు.
నేడు రామతీర్థ రామాలయానికి వెళ్ళేఅర్హత మీకు ఉందా బాబు గారు?రాజకీయాలకోసం రామాలయానికి వెళ్ళి ఆ ఆలయాన్ని అపవిత్రంచేయద్దు ” అని రాసుకొచ్చారు.

సెల్ఫ్ గోల్ 1: అప్పటి దేవాదాయ శాఖ మంత్రి బిజెపి నేత యే

అయితే విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ల పై నెటిజన్లు నవ్వుకుంటున్నారు. కారణం ఆయన చెప్పిన సమయం లో దేవాదాయ శాఖ మంత్రి గా ఉన్నది బిజెపి నేత మాణిక్యాల రావు. ఇంకొందరైతే ఆయనపై మండిపడుతూ చంద్రబాబు హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న మాణిక్యాలరావు బిజెపి నేత యే అని మర్చిపోయావా, లేక ప్రజలకు ఏమి గుర్తుండవు మనమేం చెప్పినా అదే నమ్ముతారు అన్న భ్రమలో ఉన్నావా విష్ణువర్ధన్ రెడ్డి అంటూ విమర్శలు చేశారు. మిడిమిడి జ్ఞానం తో ట్వీట్లు చేస్తే ఇలాగే ఉంటుంది అంటూ మరికొందరు చురకలంటించారు.

సెల్ఫ్ గోల్ 2: జగన్ ని కాపాడడానికే బాబు ని టార్గెట్ అంటూ విమర్శలు

అయితే విష్ణువర్ధన్ రెడ్డి గురించి గతంలో జనసైనికులు తవ్వి తీసిన సోషల్ మీడియా పురాణం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ దెబ్బకు కొంతకాలం పాటు మీడియా ముందు కనిపించకుండా విష్ణువర్ధన్ రెడ్డి , లో ప్రొఫైల్ మెయింటైన్ చేసిన సంగతి కూడా తెలిసిందే. మహిళల అంగాంగ వర్ణనలు, హీరోయిన్ సమీరా రెడ్డి పై, కులాభిమానం తోనో మరే కారణం చేతనో, ఆయన చేసిన వ్యాఖ్యలు, పైకి బిజెపి లో ఉన్నా తన సామాజిక వర్గానికి చెందిన పార్టీపై ఆయనకు విపరీతమైన అభిమానం ఉందని సూచించే పోస్ట్లు విష్ణువర్ధన్ రెడ్డి పై ప్రజలలో ఉన్న అభిప్రాయాన్ని కాస్త చులకన చేశాయి.

అయితే అధికార ప్రభుత్వం పై బిజెపి పార్టీ ఒక స్టాండ్ తీసుకుని పోరాడుతున్న సమయంలో, ప్రస్తుత అధికార పార్టీ కంటే గతంలోనే ఎక్కువ దాడులు జరిగాయని అర్థం వచ్చేలా విష్ణువర్ధన్ రెడ్డి చేసిన ట్వీట్ కూడా ఇదే కోవలో, జగన్ ని కాపాడే ఉద్దేశంతో చేసిందా అన్న అనుమానాలు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. పైగా ఆ సమయంలో దేవాదాయ శాఖ మంత్రి గా ఉన్నది తమ పార్టీ నేత ఏ అని తెలిసి కూడా, ఇలాంటి ట్వీట్ చేస్తే అది తన పార్టీకి డ్యామేజ్ చేస్తుంది అని తెలిసి కూడా, విష్ణువర్ధన్ రెడ్డి జగన్ హయాంలో కంటే తమ పార్టీ నేత దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న టిడిపి హయాం లో ఎక్కువ దాడులు జరిగాయి అని ట్వీట్ చేయడం సెల్ఫ్ గోల్ గా మారింది. పైగా విష్ణువర్ధన్ రెడ్డి ఈ ట్వీట్ చేయగానే, జగన్కు మద్దతుగా నిలిచే కొన్ని అగ్ర చానల్స్ వీటిని ప్రముఖంగా స్క్రోలింగ్ ఇవ్వడం చూస్తుంటే, ఉద్దేశపూర్వకంగానే చాలా తెలివిగా విష్ణు వర్ధన్ రెడ్డి ఈ ట్వీట్ చేశాడేమో అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

మొత్తానికి విష్ణువర్ధన్ రెడ్డి, తాను బిజెపిలో ఉన్నప్పటికీ, తన స్టైలే సపరేటు అన్నట్లు వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్ కు అన్నీ తెలుసు… ఢిల్లీ లిక్క‌ర్ కేసులో సంచ‌ల‌నం!

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్క‌ర్ కేసు బిగ్ ట‌ర్న్ తీసుకునేలా క‌న‌ప‌డుతోంది. ఇప్ప‌టికే ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైలుపాలు కాగా... మాజీ సీఎం కేసీఆర్ కు ఈ స్కాం...

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లోకి కేసీఆర్‌ను లాక్కొచ్చిన ఈడీ

కల్వకుంట్ల ఫ్యామిలీకి ఏదీ కలసి రావడం లేదు. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ పేరును ఈడీ తొలి సారిగా ప్రస్తావించింది. లిక్కర్ స్కాం గురించి కవిత ముందే కేసీఆర్‌కు చెప్పిందని.. గోపికుమరన్...

ఈవారం బాక్సాఫీస్‌: మూడు సినిమాల ముచ్చ‌ట‌

ఐపీఎల్ హంగామా అవ్వ‌గానే టాలీవుడ్ కి మూడ్ వ‌చ్చింది. వ‌రుస‌గా సినిమాల్ని రంగంలోకి దింపే ప‌నిలో ప‌డింది. ఈ వారం ముచ్చ‌ట‌గా మూడు సినిమాలు ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌య్యాయి. విశ్వ‌క్‌సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్...

కూటమి గెలుపు ఖాయమని సజ్జల సంకేతాలు..!?

వైసీపీ ఓటమి ఖాయమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ దిశగా మానసికంగా ప్రిపేర్ అవుతున్నట్టు ఉన్నారు. ఫలితాల విడుదలకు మరో కొద్ది రోజుల సమయమే ఉండటంతో ఇప్పుడు గెలుపుపై అతికి పోయి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close