అల్లుడు అదుర్స్‌.. మ‌ల్టీస్టార‌ర్‌

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా రూపొందిన చిత్రం `అల్లుడు అదుర్స్‌`. ఈ సంక్రాంతికి విడుద‌ల కాబోతోంది. ఒక‌ట్రెండు రోజుల్లో ట్రైల‌ర్ కూడా చూపించేయ‌బోతున్నారు. సోనూసూద్ కి ఈ సినిమాలో కీల‌క‌మైన పాత్ర ద‌క్కింది. ముందు విలన్ గా సోనూసూద్ ని ఎంచుకున్నారు. అయితే క‌రోనా త‌ర‌వాత‌.. సోనూ రియ‌ల్ హీరో అయ్యాడు. దానికి త‌గ్గ‌ట్టే.. ఈ సినిమాలో సోనూ సూద్ పాత్ర రూపు రేఖ‌ల్ని మార్చేశారు. నెగిటీవ్ పాత్ర నుంచి పాజిటీవ్ పాత్ర‌గా తీర్చిదిద్దారు. పాట‌ల్లోనూ.. సోనూసూద్ క‌నిపించ‌బోతున్నాడు. ఓ ర‌కంగా చెప్పాలంటే.. అల్లుడు అదుర్స్‌ని మ‌ల్టీస్టార‌ర్ చేసేశారు. లాక్ డౌన్‌త‌ర‌వాత‌.. స్క్రిప్టులో కొన్ని కొత్త సీన్లు రాసి.. వాటిలో సోనూసూద్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ట్రైల‌ర్ లో కూడా సోసూకి స్కోప్ ఎక్కువ ఇచ్చేలా చేస్తున్నారు. సోనూ సినిమా అంటే… ప్రేక్ష‌కులు పాజిటీవ్ కోణంలో చూస్తార‌న్న ఆలోచ‌న చిత్ర‌బృందానిది. అందుకే.. ఈ సినిమాని కాస్త మ‌ల్టీస్టార‌ర్ చేసేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close