తొడకొట్టిన కోడి..! కో అంటే కోట్లు..!

ఈ సంక్రాంతికి కోస్తా జిల్లాల్లో కోడి తొడకొట్టింది. గ్రామాల్లో ఎక్కడ చూసినా కోడిపందేల బరులే కనిపించాయి. అన్నింటికీ వైసీపీ రంగులు వేయడంతో పోలీసులుకూడా వాటి వైపు చూడలేదు. కోట్లకుకోట్లు జూదం రూపంలో చేతులు మారాయి. గుండాట, పేకాటలు కూడా జోరుగా సాగాయి. సంక్రాంతి అంటే కోడి పందాలన్నట్లుగా కోస్తా జిల్లాల్లో విరివిగా బరులను ఏర్పాటు చేశారు. గోదావరి జిల్లాల్లో ఊరూవాడా బరులు ఏర్పాటు చేశారు. అన్ని చోట్లా.. వైసీపీ రంగులేశారు. అంటే.. అవి వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన బరులని.. అంటే.. లైసెన్స్ ఉన్నట్లేనని .. పోలీసులు అటు వైపు రాకూడదని అర్థం. దానికి తగ్గట్లుగానే పోలీసులు ఎవరూ పట్టించుకోలేదు. దాంతో ఆ బరుల వద్ద .. ఇష్టం వచ్చినట్లుగా కోట్లకు కోట్లు పందేలు నడిచాయి. పేకాట క్లబ్‌ల నిర్వహణలో రాటుదేలిపోయిన నేతలు ఎక్కువగా ఉండటంతో… పందెల నిర్వహణ సులువుగా మారిపోతోంది.

డబ్బులకు టోకెన్లు ఇవ్వడం.. అప్పటికప్పుడు బంగారం కుదువ పెట్టుకోవడం… కావాలంటే ఆస్తులు తనఖా పెట్టుకోవడం కోసం కూడా ఏర్పాట్లు చేసేశారు. ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున జూదరులు.. తరలి వస్తున్నారు. ఒక్కో జిల్లాలో రోజుకు యాబై కోట్ల వరకూ చేతులు మారుతున్నట్లుగా అంచనా వేస్తున్నారు. జూదంలో గెలిచేవాళ్లు ఉండరు… గెలిచినా ఓడిపోయేవారే ఉంటారు. కానీ మధ్యవర్తులు.. బరులు నిర్వహించేవారే పెద్ద ఎత్తున సంపాదించుకుంటారు. కోడి పందెలకు తోడు.. గుండాట.. పేకాట కూడా సమాంతరంగా నడుస్తున్నాయి. జూదరులు ఏది ఇష్టమైతే దానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు.

కోడిపందేలతో పాటు పేకాట, గుండాట కూడా నడుస్తూండటం.. పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతూండటంతో.. గొడవలు జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నారు. పందాలలో భారీ ఎత్తున బెట్టింగ్ జరుగుతుంది. ఈ బెట్టింగ్ లో వివాదం కారణంగా ఇరువర్గాలు ఒకరిపై ఒకరు గంట సేపు దాడులు నిర్వహించడంతో కొన్ని కోట్ల భయానక వాతావరణం ఏర్పడుతోంది. పోలీసులు మాత్రం ఆ వైపు చూడటం లేదు. పండుగ సందర్భంగా.. మూడు రోజులు పట్టించుకోమని.. తర్వాత మాత్రం తాట తీస్తామని పోలీసులు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close