వ్యాక్సిన్ వ్యాపారంతో ప్రజలకు చేటు..!

” ఆ డాక్టర్ చేయి చాలా మంచిది..!” .. అని మన కుటుంబసభ్యులు.. చుట్టుపక్కల వాళ్లు.. బంధువులు అనడం చాలా సార్లు విని ఉంటాం. మనం కూడా ఆ డాక్టర్ బాగా చూస్తారు అని చాలా మంది వద్దకు వెళ్తాం. ఆయా డాక్టర్లు ఏమీ పై నుంచి దిగిరాలేదు. కొంత మంది స్పెషలిస్టులు కూడా కాదు. కానీ.. వారికి ఓ ప్రివిలేజ్.. వారు చేసిన వైద్యం ద్వారా వస్తుంది. ఆ ప్రివిలేజే నమ్మకం. రోగికి వైద్యం చేసే డాక్టర్‌పై నమ్మకం ఉంటే… అతను ఇచ్చే మెడిసిన్స్‌లో పస లేకపోయినా రోగం తగ్గిపోతుంది. ఎందుకంటే.. మానసిక ధైర్యానికి మించిన మందు ఏదీ ఉండదు. అయితే రోగిలో కలగాల్సింది నమ్మకమే. ఆ నమ్మకం వైద్యుడు కల్పించగలిగినప్పుడు.. ఆ రోగి కల్పించుకోగలిగినప్పుడు.. రోగం త్వరగా నయమవుతుంది. ఇప్పుడు కరోనా వైరస్ విషయంలో.. ఆ నమ్మకం దేశానికి త్వరగానే కలుగుతోంది. వ్యాక్సిన్ రాక ముందే ప్రజల్లో దైర్యం అనే వ్యాక్సిన్ ఫుల్ డోస్‌లో కనిపిస్తోంది.

మహమ్మారిపై ఇప్పటికే ప్రజల విజయం..!

2020లో విరుచుకుపడిన మహమ్మారికి 2021 పరిష్కారం చూపుతోంది. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోంది. ప్రపంచదేశాల శాస్త్రవేత్తలందరూ అహోరాత్రులు శ్రమించి.. కరోనా వైరస్‌కు విరుగుడు కనిపెట్టగలిగారు. చాలా మంది ఏకకాలంలో ఈ వైరస్ వ్యాక్సిన్‌ను సిద్ధం చేయగలిగారంటే .. అది మానవాళి చేసుకున్న అదృష్టమే ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా లక్షల్లో చనిపోయారు. ఇప్పటికీ లక్షల మందికి వైరస్ సోకుతోంది. కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుంగిపోయాయి. కోలుకోవడం కష్టమవుతోంది. ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్న ప్రముఖులెందరో..! . ఇతర అనారోగ్యాలకు ఈ వైరస్ తోడయితే.. ప్రాణాపాయమే. తేలిగ్గా తీసుకోలేని భయంకరమైన వైరస్ కరోనా. కానీ ఎలా ఉన్నా అంటుకునేది అంటుకుంటుంది కాబట్టి.. ప్రజలు ఏం జరిగితే.. అది జరుగుతుందన్న ఉద్దేశంతో లైట్ తీసుకోవడం ప్రారంభించారు. అందుకే… కొత్త ఏడాదిలో కరోనా భయం ప్రజల్లో కనిపించడం లేదు.

సమాజాన్ని ధ్వంసం చేసిన వైరస్ భయం…!

కరోనా వచ్చిందనే భయంతో గుండెపోటుతో వ్యక్తి మృతి..! లాంటి వార్తలు.. లాక్‌డౌన్ టైంలో ఎన్ని చూశామో గుర్తు లేదు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న వారు కూడా కరోనా సోకిందనే సరికి.,. ఆందోళనలో పడిపోయి.. ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. కొన్ని కుటుంబాలు నాశనమైపోయాయి. కానీ.. కొన్ని లక్షల మంది వైరస్ సోకినా కనీసం ఆస్పత్రికి వెళ్లకుండా కోలుకున్నారు. అంతేనా… చాలా మందికి అసలు వైరస్ సోకింది.. పోయిందికూడా తెలియలేదు. అలాంటి వైరస్ విషయంలో.. మొదట్లో జరిగిన ప్రచారం.. కట్టడి కోసం వేసిన లాక్‌డౌన్‌లు ప్రజల మైండ్‌లో భయంకరమైన భయాల్ని పాతేశాయి. సోషల్ మీడియా ఎప్పట్లాగే దీనికి తన వంతుగా విధ్వంసకర సాయం చేసింది. ప్రతీ దానికి కరోనా తో ముడి పెట్టి చేసే ప్రచారాలకు అంతే లేకుండా లేకుండా పోయింది. కరోనాతో చనిపోయారన్న కారణంగా ఎంత ధనవంతులైనప్పటికీ.. కుటుంబసభ్యులు కూడా దగ్గరకు వెళ్లకపోవడం.. చుట్టుపక్కల వారు అదో రకంగా ప్రవర్తించడంతో.. కరోనా వల్ల మానవ సంబంధాలు కూడా ప్రమాదంలో పడిపోయినట్లయింది. సమాజంలో కుటుంబసభ్యుల మధ్య ఉన్న అనుబంధాన్ని కూడా ఈ కరోనా తుంచేసే ప్రయత్నం చేశారు. 2020లో ఈ కరోనా ప్రజలకు పెట్టిన పరీక్షలు.. అటు ఆర్థికంగా.. ఇటు మానసికంగానేకాదు.. కుటుంబ పరంగా కూడా ఉన్నాయి. వీటన్నింటినీ తట్టుకుని ప్రజలు ముందడుగు వేస్తున్నాయి. కొత్త స్ట్రెయిన్‌లు.. సరికొత్త వైరస్‌లు అంటూ ప్రచారం జరుగుతున్నా ఇప్పుడు డోంట్ కేర్ అంటున్నారు.

అసలైన వ్యాక్సిన్ “ధైర్యం” ..! ఇప్పటికే ఫుల్ డోస్..!

కొత్త ఏడాది ముందు నుంచే.. మీడియాలో.. సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంపై ప్రజలు నిజానిజాలు స్వయంగా తెలుసుకోవడం ప్రారంభించారు. కరోనా పేరుతో తమను భయపెట్టి… నాశనం చేశారని గుర్తించారు. దాని చేతికి చిక్కినా.. పోయేదేం లేదని.. అది ఎప్పుడూ వచ్చే జలుబులాంటిదేనని గుర్తించారు. అందుకే స్వేచ్చగారోజువారీ కార్యకలాపాలు నిర్వహించుకోవడం ప్రారంభించారు. ప్రభుత్వాలుకూడా.. పేరుకే ఆంక్షలు పెడుతున్నాయి.. కానీ.. ఎవరు ఏం చేసినా పట్టించుకోవడం లేదు. కొత్త ఏడాదిలో ప్రజలు ఇక పూర్తి స్థాయి సాధారణ జనజీవనానికి అలవాటుపడిపోయారు. వారికి ఇప్పుడు కరోనాభయం లేదు. వైరస్ వస్తుందన్న ఆందోళనా లేదు. ఒక వేళ వచ్చినా… ఆస్పత్రికి పరుగెత్తాలన్నా ఆలోచనా చేయడం లేదు. లక్షణాలు కనిపిస్తే.. రెస్ట్ తీసుకుంటున్నారు.. లేకపోతే.. అదీ లేదు. ప్రజల్లో వైరస్ అంటే.. భయం పోయింది. ధైర్యం వచ్చింది. ఓ రకంగా అదే వ్యాక్సిన్.

మెడిసిన్ వ్యాక్సిన్ పేరుతో ప్రజలతో వ్యాపారం చేయకూడదు..!

కరోనా ఇప్పటికే బలహీనపడిపోయింది. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ వేసిన తర్వాత ఇక ఎలాంటి భయాలు వద్దు.. మాస్కులు కూడా పెట్టుకోనవసరం లేదు అని ప్రభుత్వాలు ప్రకటించవచ్చు. కానీ.. ఆ వ్యాక్సిన్‌ పేరుతో వ్యాపారం చేయడం.. ప్రజల్ని మోసం చేయడమే అవుతుంది. వ్యాక్సిన్ లేకపోయినా ఇప్పటికీ.. పరిస్థితులు ఏ మాత్రం దిగజారలేదు. దేశం మొత్తం నార్మల్ అయిపోయింది. అనేకానేక పరిశోధనా కేంద్రాలు చేస్తున్న పరిశోధనల్లో… ప్రజల్లో యాంటీబాడీలు బాగా పెరిగిపోయాయి. ఇప్పుడు ప్రత్యేకంగా కోవిడ్ దాడి చేసినా.. కోవిడ్ స్ట్రెయిన్ సోకినా… తట్టుకోగలిగేశక్తి ఉంది. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్ అనేది ప్రజల్లో ధైర్యం మరింత పెంచడానికే ఉపయోగపడాలి కానీ.. దాన్ని మల్టీనేషనల్ కంపెనీల వ్యాపారానికి ఉపయోగపడకూడదు. అలా చేయడం ప్రజల్ని దోపిడి చేయడమే అవుతుంది.

ప్రజల్ని మెడికల్ కంపెనీలకు వదిలేస్తే.. కష్టమే..!

మెడికల్ మాఫియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్తే సామాన్యులు బిల్లులు చెల్లించలేరు. ఆస్తులేమైనా ఉంటే రాసివ్వాల్సిందే. ప్రభుత్వాలు వైద్య సౌకర్యాల కల్పన కోసం ఎన్ని వేల కోట్లు వెచ్చించినా పరిస్థితి మారదు. ఇలాంటి సమయంమలో పుట్టుకొస్తున్న కొత్త కొత్త వైరస్ సవాళ్ల విషయంలో ప్రజల్ని మరింత గందరగోళ పరిచి..భయపెట్టి.. వారి ఆదాయాన్ని మెడికల్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేయడం చేతకానితనమే అవుతుంది. ఇప్పటికే ప్రజల్లో నెలకొన్న భయాల దృష్ట్యా వ్యాక్సిన్ పేరుతో మార్కెటింగ్ ప్రారంభిస్తే ప్రజలు అప్పో సప్పో చేసి కొనుక్కుంటారు. అలాంటి చాన్స్ ఇవ్వకుండా.,.. ప్రభుత్వమే రంగంలోకి దిగాలి. ఎవరికి వ్యాక్సిన్ అవసరమో ప్రభుత్వమే ఇవ్వాలి. మార్కెట్‌ను ప్రైవేటు కంపెనీలకు వదలకూడదు. అలా వదిలితే.. ప్రజల పాలిట అదే పెద్ద వైరస్ అయ్యే ప్రమాదం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close