సంక్రాంతి వ‌సూళ్ల‌కు గండి

గ‌త సంక్రాంతికి.. వంద కోట్ల పోస్ట‌ర్లు రెండు చూసే అవ‌కాశం వ‌చ్చింది. స‌రిలేరు నీకెవ్వ‌రు, అల వైకుంఠ‌పుర‌ములో.. రెండూ క‌ల‌క్ష‌న్ల మోత మోగించాయి. తెలుగు సినీ చ‌రిత్ర‌లో… అదే అత్యంత విజ‌య‌వంత‌మైన సంక్రాంతిగా ట్రేడ్ వ‌ర్గాలూ విశ్లేషించేశాయి.

ఈ సంక్రాంతికి మాత్రం.. ఆ వ‌సూళ్ల గ‌ల‌గ‌ల‌లు, వంద‌కోట్ల పోస్ట‌ర్లూ క‌నిపించ‌లేదు. క‌నిపించ‌వు కూడా. ఎందుకంటే.. ఈ ద‌ఫా.. స్టార్ హీరో బ‌రిలో లేడు. నాలుగు సినిమాలొచ్చినా… ప్రేక్ష‌కుల ఓటు మాత్రం `క్రాక్‌` కే ప‌డింది. పైగా క్రాక్‌… తొలి రోజు మార్నింగ్‌షో, మాట్నీ..లు ర‌ద్ద‌య్యాయి. కొన్ని చోట్ల ఫ‌స్ట్ షో కూడా ప‌డ‌లేదు. దాంతో.. ఫ‌స్ట్ డే వ‌సూళ్ల హంగామా ని చూడ‌లేక‌పోయింది.  మాస్ట‌ర్‌, రెడ్‌, అల్లుడు అదుర్స్‌.. వీటిలో ఏది స‌రిగా నిల‌బ‌డే సినిమా కాదు. అయితే.. సంక్రాంతికి సినిమా థియేట‌ర్ల‌న్నీ క‌ళ‌క‌ళ‌లాడిపోతుంటాయి. టాక్ తో సంబంధం లేకుండా.. జ‌నాలు టికెట్ల కోసంక్యూలో ఉంటారు. `ఫ‌ర్వాలేదు` అనిపించుకున్న సినిమా కూడా.. మంచి వ‌సూళ్ల‌నే తెచ్చుకుంటుంది. అయితే.. 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధ‌న‌.. వ‌సూళ్ల‌కు దారుణంగా గండి కొట్టింది. స‌గం టికెట్లే అమ్మాల్సిరావ‌డంతో రెవిన్యూ ఆ మేర‌కు ప‌డిపోయింది. జ‌నాలు సినిమా చూడ్డానికి సిద్ధంగానే ఉన్నా, టికెట్లు లేవు. సంక్రాంతి మూడ్ అంతా వెళ్లిపోయాక‌.. అప్పుడు ఆ స‌గం కూడా నిండే ఛాన్సు లేదు. నిజానికి 100 శాతం ఆక్యుపెన్సీ ఉంటే గ‌నుక‌… క్రాక్‌, మాస్ట‌ర్ సినిమాల‌కు మ‌రింత మంచి వ‌సూళ్లు వ‌చ్చేవి. గ‌త కొన్ని నెల‌లుగా… థియేట‌ర్లు లేక‌, అందులో సినిమాలు లేక బోసిబోయిన‌… ఇండ్ర‌స్ట్రీకి కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భించేది. కాక‌పోతే.. `క్రాక్‌` లాంటి మంచి మాస్ హిట్టు ఈ సంక్రాంతికి ప‌డ‌డం, జ‌నాలు.. థియేట‌ర్ల‌కు రావ‌డానికి సిద్ధంగానే ఉన్నారు, వాళ్ల‌లో క‌రోనా భ‌యాలు లేవు.. అనే సంకేతాలు దొర‌క‌డంతో చిత్ర‌సీమ కాస్త ఊపిరి పీల్చుకుంది. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఫిక్స్ అయిపో..!?

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మనాభం అని కాకుండా పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటానని సవాల్ చేశారు. ముద్రగడ ధీమా ఏంటో...

నన్ను పట్టించుకోరా… ఓ తండ్రి అనూహ్య నిర్ణయం

కని పెంచిన కొడుకులు పట్టించుకోలేదని నిరాశ చెందిన ఓ తండ్రి అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. రెక్కల కష్టంతో పెంచిన కొడుకులు తనను పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో యావదాస్తిని కొండగట్టు ఆంజనేయ స్వామికి సమర్పించేందుకు...

డైరెక్ట‌ర్స్ డే… రాజ‌మౌళి ‘డాన్స్’ షో!

ద‌ర్శ‌క దిగ్గ‌జం దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌యంతిని పుర‌స్క‌రించుకొని, తెలుగు ద‌ర్శ‌కులంతా క‌లిసి 'డైరెక్ట‌ర్స్ డే'ని సెల‌బ్రేట్ చేసుకోబోతున్నారు. మే 4న ఈ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రగ‌బోతోంది. అందుకోసం ద‌ర్శ‌కులంతా క‌లిసి క‌స‌ర‌త్తులు చేస్తున్నారు....

ఏప్రిల్‌ బాక్సాఫీస్ రివ్యూ: అంతా చ‌ప్పచ‌ప్ప‌గా!

2024లో అప్పుడే 4 నెల‌లు గ‌డిచిపోయాయి. జ‌న‌వ‌రి సంక్రాంతి సినిమాల ద‌య వ‌ల్ల `ఓకే` అనిపించుకొంది. ఫిబ్ర‌వ‌రిలో అన్నీ ఫ్లాపులే. మార్చి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఓం భీమ్ భుష్‌, ప్రేమ‌లు, టిల్లూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close