ఖమ్మం పంచాయతీ తీర్చేందుకు సిద్ధమైన కేటీఆర్..!

ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్‌ను టెన్షన్ పెడుతోంది. ప్రముఖలనదగ్గ నేతలందరూ టీఆర్ఎస్‌లోనే ఉన్నారు. వారి కోసం ఇతర పార్టీలు వలలేస్తున్నాయి. ప్రాధాన్యం దక్కకపోతే.. ఆ ప్రముఖ నేతలూ పార్టీలో ఉండే అవకాశం లేదు. ఇప్పటికిప్పుడు అక్కడ మంత్రి అజయ్ హవా నడుస్తోంది. సీనియర్ తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీలో ఎక్కడా కనిపించని పరిస్థితి. వీరిద్దరిపై గతంలో బీజేపీ కన్నేసిందని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో తొలి సారిగా.. మాజీ ఎంపీ పొంగులేటి ధిక్కార స్వరం వినిపించారు. పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత దక్కడం లేదని.. తన అనుచరుల్ని కూడా.. పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు ఒక్క సారిగా కలకలం రేపడంతో వెంటనే హైకమాండ్ స్పందించింది.

ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా సీనియర్ నేతల్ని ఇతర పార్టీలు పట్టుకుపోతాయనుకున్నారేమో కానీ వెంటనే పొంగులేటి సుధాకర్ రెడ్డికి నేరుగా కేటీఆర్ నుంచే కాల్ వచ్చింది. మాట్లాడుకుందాం ప్రగతి భవన్‌కు రమ్మని పిలుపునిచ్చారు. దీంతో పొంగులేటి తాను.. బీజేపీలో చేరడం లేదని.. పార్టీలో ఎదురవుతున్న పరిస్థితుల్నే చెప్పానని మీడియాకు చెప్పుకొచ్చారు. ఈ లోపు.. అసంతృప్తిగా ఉన్నారని భావిస్తున్న సీనియర్ నేత తుమ్మలతో కూడా… మంత్రి పువ్వాడ అజయ్‌, ఎంపీ నామా నాగేశ్వరరావు భేటీ అయ్యారు.

ఖమ్మం జిల్లాలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. హైకమాండ్ సందేశాన్ని వివరించారు. తుమ్మల కూడా కొద్ది రోజులుగా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. పాలేరులో ఆయన ఓడిపోయిన తర్వాత అక్కడ గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను టీఆర్ఎస్‌లో చేర్చుకుని పెత్తనం ఆయనకే ఇచ్చారు. తుమ్మల వర్గం.. ఎమ్మెల్యే వర్గానికి సరిపోలడం లేదు. ఇప్పుడు అందరికీ.. ఏవో పదవులు ఇచ్చి సంతృప్తి పరిచి.. ఎలాగోలా పార్టీలో కొనసాగే చేసే మిషన్‌ను కేటీఆర్ నెత్తికెత్తుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని గెలిపించండి: చిరంజీవి

ప‌వ‌న్ ని గెలిపించ‌డానికి చిరంజీవి సైతం రంగంలోకి దిగారు. పిఠాపురం నుంచి ప‌వ‌న్ ని గెలిపించాల‌ని, జ‌నం కోసం ఆలోచించే ప‌వ‌న్‌ని చ‌ట్ట‌స‌భ‌ల‌కు పంపాల‌ని ఆయ‌న ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు...

ప్ర‌భాస్ కు ‘హీరోయిన్‌’తో స‌మ‌స్యే!

ప్ర‌భాస్ - హ‌ను రాఘ‌వ‌పూడి కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 1945 నేప‌థ్యంలో సాగే పిరియాడిక‌ల్ డ్రామా ఇది. యుద్ధ నేప‌థ్యంలో సాగే ప్రేమ క‌థ‌. ఈ సినిమాలో హీరోయిన్...

ఉక్క‌పోత‌… ఈసీతో పోరుకు వైసీపీ సిద్ధం!

ఫ్యాన్ గాలికి తిరుగులేదు... మేమంతా సిద్ధం అంటూ వైసీపీ చేస్తున్న ప్ర‌చారం తేలిపోతుంది. ఆ పార్టీకి గ్రౌండ్ లోనూ ఏదీ క‌లిసి రావ‌టం లేదు. అంతా తానే అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్న జ‌గ‌న్ కు...

డ‌బుల్ ఇస్మార్ట్‌: ఈసారి ‘చిప్‌’ ఎవ‌రిది?

పూరి జ‌గ‌న్నాథ్ రాసుకొన్న‌ డిఫరెంట్ క‌థ‌ల్లో 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఒక‌టి. హీరో మెద‌డులో చిప్ పెట్టి - దాని చుట్టూ కావ‌ల్సినంత యాక్ష‌న్, డ్రామా, వినోదం న‌డిపించేశారు. ఆ పాయింట్ కొత్త‌గా అనిపించింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close