శంక‌ర్ తెలుగు సినిమా.. అయ్యే ప‌నేనా?

భార‌తీయ ద‌ర్శ‌కుల‌లో శంక‌ర్ ది విభిన్న‌మైన శైలి. రెండు మూడేళ్ల‌కు ఒక సినిమానే తీస్తుంటాడు. అందులో త‌న ప్ర‌త్యేక‌త‌లు ఉండేలా జాగ్ర‌త్త ప‌డ‌తాడు. శంక‌ర్ ఏం చేసినా భారీగానే ఉంటుంది. భారీ ఆలోచ‌న‌లు, భారీ బడ్జెట్ లూ, పెద్ద హీరోలూ.. ఇదే శంక‌ర్ శైలి. `ఐ` వ‌ర‌కూ ఫ్లాప్ అన్న మాటే ఎర‌గ‌డు. `రోబో 2` అంత‌గా ర‌క్తి క‌ట్ట‌క‌పోయినా శంక‌ర్ ఇమేజ్ పై వ‌చ్చేన ప్ర‌భావం ఏమీ లేదు. ఇప్పుడు `భార‌తీయుడు 2` ప‌నిలో ఉన్నాడు శంక‌ర్‌.

శంక‌ర్ ఓ తెలుగు సినిమా చేస్తున్న‌ట్టు.. అందులో ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తున్న‌ట్టు ఓ గాసిప్ చ‌క్క‌ర్లు కొడుతోంది. అది ఎలా పుట్టిందో, అందులో నిజాలెంతో తెలీదు గానీ, టాలీవుడ్ ని షేక్ చేసే వార్తే అది. కానీ.. ఈ కాంబో అయ్యే ప‌నేనా? అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌. శంక‌ర్ సినిమాలేవీ ఓ ప‌ట్టాన తెవ‌ల‌వు. ఆ విష‌యంలో.. రాజ‌మౌళి కంటే.. చాద‌స్తం ఎక్కువ‌. `భార‌తీయుడు 2` ఎప్పుడో మొద‌లెట్టాడు. ఇప్ప‌టి వ‌ర‌కూ స‌గం సినిమా కూడా పూర్త‌వ్వ‌లేదు. అదెప్పుడు అవుతుందో తెలీదు. దానికి తోడు శంక‌ర్ కి ఇది వ‌ర‌క‌టి క‌మిట్‌మెంట్స్ ఉన్నాయి.ఇటు ప‌వ‌న్‌, అటు చ‌ర‌ణ్ ఇద్ద‌రూ బీజీనే. వాళ్లిద్ద‌రినీ టై అప్ చేసేంత స‌మ‌యం.. ఎప్పుడు చిక్కాలి? పైగా శంక‌ర్ తెలుగులో సినిమా చేయ‌డానికి ఎప్పుడూ దృష్టి పెట్ట‌లేదు. చిరంజీవి అంత‌టి వాడే… `నాతో ఓ సినిమా చేయ్‌` అని ఆఫర్ ఇచ్చినా శంక‌ర్ ప‌ట్టించుకోలేదు. మ‌హేష్ తో శంక‌ర్ ఓ సినిమా చేస్తాడ‌ని ఇది వ‌ర‌కు వార్త‌లొచ్చాయి. చాలా ఏళ్లు మ‌హేష్ – శంక‌ర్ సినిమా కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూశారు. కానీ.. అది కాస్త మ‌రుగున ప‌డిపోయింది. ఇప్పుడు ప‌వ‌న్ – చెర్రీల కాంబో అంటున్నారు. నిజంగా ఈ సిన‌మా సెట్ అయితే సంతోష‌మే. కానీ.. శంక‌ర్ స్టైల్ తెలిసిన‌వాళ్లెవ‌రైనా `ఇది అయ్యే ప‌ని కాదు` అంటూ లైట్ తీసుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స్టార్‌ మాలో ఆదివారం సందడే సందడి!

ఆదివారం... ఆ రోజుని తలుచుకుంటేనే ఏదో సంతోషం. ఆ రోజు వస్తోందంటే అదో చెప్పలేని ఆనందం. మరి అదే ఆదివారం నాడు ఆ సంతోషాన్ని, ఆనందాన్ని మూడింతలు పెంచేలా ఏదైనా ఒక ఫ్లాన్‌...

‘గాలి సంప‌త్’ ట్రైల‌ర్‌: ఫ‌.. ఫా.. ఫీ.. ఫో.. అంటే అదిరింది!

త‌న పేరు సంప‌త్‌. నోట్లోంచి గాలి త‌ప్ప మాట రాదు. అందుకే త‌న‌ని గాలి సంప‌త్ అని పిలుస్తారు. త‌న‌కో కొడుకు. త‌న‌కీ కొన్ని ఆశ‌యాలు, ఆశ‌లు, ప్రేమ‌లూ ఉన్నాయి. కానీ.. త‌నకు...

తమిళనాడులో ఈ సారి ఉచితాలకు మించి..!

తమిళనాడు సీఎం పళని స్వామి ఎన్నికలకు ముందుగా ప్రజలకు భారీ తాయిలాలు ప్రకటించారు.అమలు చేస్తారోలేదో తెలియదు కానీ.. అధికారికంగా నిర్ణయాలు తీసేసుకున్నారు. రుణాల మాఫీతో పాటు విద్యార్థులందరూ పరీక్షలు రాయకుండానే పాసయ్యేలా నిర్ణయం...

పెన్షన్ పెంచుకుంటూ పోయేది వచ్చే ఏడాదే..!

పెన్షన్ రూ. మూడు వేలకు పెంచుకుంటూపోతామని జగన్ హామీ ఇవ్వడంతో .. పెన్షనర్లు అంతా ఓట్ల వర్షం కురిపించారు. అయితే 2019 మేలో అధికారం చేపట్టిన జగన్.. రూ.250మాత్రమే పెంచారు. అప్పుడే క్లారిటీ...

HOT NEWS

[X] Close
[X] Close