‘గ‌ని’గా వ‌రుణ్ తేజ్‌

`ఫిదా`, `తొలి ప్రేమ‌`, `గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్‌` ఇలా వ‌రుస హిట్ల‌తో చెల‌రేగిపోతున్నాడు వ‌రుణ్ తేజ్‌. ఇప్పుడు బాక్స‌ర్ అవ‌తారం ఎత్తుతున్నాడు. కిర‌ణ్ కొర్ర‌పాటి అనే ద‌ర్శ‌కుడితో వ‌రుణ్ ఓ సినిమా చేస్తున్నాడు. ఉపేంద్ర‌, సునీల్ శెట్టి.. లాంటి స్టార్లు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. వ‌రుణ్ 10 వ సినిమా ఇది. రేపు వ‌రుణ్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌డంతో పాటు, టైటిల్ కూడా చెప్పేయ‌నున్నారు. ఈ సినిమాని `గ‌ని` అనే పేరు పెట్టిన‌ట్టు స‌మాచారం అందుతోంది. బాక్సింగ్ నేప‌థ్యంలో సాగే సినిమా ఇది. `గ‌ని` అనేది క‌థానాయ‌కుడి పేరు. అందుకే అది ఫిక్స్ చేశారు. ఇందులో ఫాద‌ర్ సెంటిమెంట్ ని బాగా మిక్స్ చేశార్ట‌. ఆ పాత్ర‌లో ఉపేంద్ర క‌నిపించ‌నున్నారు. వ‌రుణ్ కి కోచ్ గా… సునీల్ శెట్టి ద‌ర్శ‌న‌మివ్వ‌బోతున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స్టార్‌ మాలో ఆదివారం సందడే సందడి!

ఆదివారం... ఆ రోజుని తలుచుకుంటేనే ఏదో సంతోషం. ఆ రోజు వస్తోందంటే అదో చెప్పలేని ఆనందం. మరి అదే ఆదివారం నాడు ఆ సంతోషాన్ని, ఆనందాన్ని మూడింతలు పెంచేలా ఏదైనా ఒక ఫ్లాన్‌...

‘గాలి సంప‌త్’ ట్రైల‌ర్‌: ఫ‌.. ఫా.. ఫీ.. ఫో.. అంటే అదిరింది!

త‌న పేరు సంప‌త్‌. నోట్లోంచి గాలి త‌ప్ప మాట రాదు. అందుకే త‌న‌ని గాలి సంప‌త్ అని పిలుస్తారు. త‌న‌కో కొడుకు. త‌న‌కీ కొన్ని ఆశ‌యాలు, ఆశ‌లు, ప్రేమ‌లూ ఉన్నాయి. కానీ.. త‌నకు...

తమిళనాడులో ఈ సారి ఉచితాలకు మించి..!

తమిళనాడు సీఎం పళని స్వామి ఎన్నికలకు ముందుగా ప్రజలకు భారీ తాయిలాలు ప్రకటించారు.అమలు చేస్తారోలేదో తెలియదు కానీ.. అధికారికంగా నిర్ణయాలు తీసేసుకున్నారు. రుణాల మాఫీతో పాటు విద్యార్థులందరూ పరీక్షలు రాయకుండానే పాసయ్యేలా నిర్ణయం...

పెన్షన్ పెంచుకుంటూ పోయేది వచ్చే ఏడాదే..!

పెన్షన్ రూ. మూడు వేలకు పెంచుకుంటూపోతామని జగన్ హామీ ఇవ్వడంతో .. పెన్షనర్లు అంతా ఓట్ల వర్షం కురిపించారు. అయితే 2019 మేలో అధికారం చేపట్టిన జగన్.. రూ.250మాత్రమే పెంచారు. అప్పుడే క్లారిటీ...

HOT NEWS

[X] Close
[X] Close