చిరు దృష్టిలో ప‌డిన గోపీచంద్ మ‌లినేని

ఓ హిట్టు సినిమా వ‌చ్చిందంటే.. ముందుగా స్పందించే స్టార్ చిరంజీవినే. ద‌ర్శ‌కుడినో, చిత్ర‌బృందాన్నో ఇంటికి పిలిపించి మ‌రీ అభినందిస్తుంటాడు. ఇప్పుడు త‌న దృష్టి గోపీచంద్ మ‌లినేనిపై ప‌డింది. ఈ సంక్రాంతికి `క్రాక్‌`తో సూప‌ర్ హిట్టు కొట్టాడు గోపీచంద్ మ‌లినేని. ఈ సంక్రాంతి సినిమా క్రాకే. అందుకే చిరు నుంచి పిలుపొచ్చేసింది. ఈ సినిమా గురించీ, అందులోని సన్నివేశాల గురించి.. చిరు త‌న‌దైన శైలిలో విశ్లేషిస్తూ.. గోపీచంద్ ని మెచ్చుకున్నాడ‌ట‌.

సాధార‌ణంగా… చిరు దృష్టి ఎప్పుడూ స‌క్సెస్‌వైపే ఉంటుంది. హిట్టు ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేయ‌డానికి ఉత్సాహం చూపిస్తుంటాడు. గోపీచంద్ మ‌లినేనికి చిరు ఆఫ‌ర్ ఇచ్చినా.. అందులో ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం ఏమీ లేదు. పైగా… మెగా ఇంట్లో హీరోలే హీరోలు. చిరుతో కాక‌పోయినా.. ఎవ‌రితోనో ఒక‌రితో సినిమా సెట్ చేసుకునే వీలుంటుంది. చిరు దృష్టిలో ఓ ద‌ర్శ‌కుడు ప‌డ్డాడంటే.. త‌ప్ప‌కుండా ఆఫ‌ర్ అందుకుంటాడు. అందులో డౌటే లేదు. చిరు కూడా ఈమ‌ధ్య కొత్త క‌థ‌ల‌కు ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఓకే చెప్పేస్తున్నాడు. త‌న కాంపౌండ్ లోనే ఉంటున్న మెహ‌ర్ ర‌మేష్ లాంటివాళ్ల‌కే చిరు ఛాన్స్ ఇచ్చాడంటే.. గోపీచంద్ మ‌లినేని లాంటి వాళ్ల‌కు అవ‌కాశం ఇవ్వ‌డంలో వింతేం ఉండ‌దు. మొన్న‌టి వ‌ర‌కూ `లూసీఫ‌ర్‌` రీమేక్ ఎవ‌రి చేతుల్లో పెట్టాలా అని చిరు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డ్డాడు. చివ‌రికి.. మోహ‌న్ రాజా చేతుల్లో పెట్టాడు. ఇప్పుడైతేనా… ఆ ఛాన్స్ త‌ప్ప‌కుండా గోపీచంద్ కే వెళ్లిపోయేది. చూద్దాం.. భ‌విష్య‌త్తులో.. ఈ కాంబినేష‌న్ సెట్ట‌వుతుందేమో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close