వెంటిలేటర్‌పై శశికళ..!

ఇరవై ఏడో తేదీన చిన్నమ్మ విడుదలవుతుంది.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దున్ని పారేస్తుందని… తమిళ మీడియా జోరుగా విశ్లేషిస్తున్న సమయంలో అనూహ్యంగా శశికళ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆమెకు శ్వాస సమస్య ఏర్పడటంతో బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలు అధికారులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి.. కరోనా టెస్టులు నిర్వహిస్తే.. నెగెటివ్ వచ్చింది. కానీ.. పరిస్థితి మెరుగుపడకపోవడంతో కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు సీటీ స్కాన్‌లో కరోనా సోకినట్లుగా తేలింది. అయితే అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఆమె ఉపిరి తిత్తులు దెబ్బతిన్నాయని డాక్టర్లు ప్రకటించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కూడా ప్రకటించారు.

శశికళ ఆరోగ్య పరిస్థితి ఒక్క సారిగా విషమంగా మారడం.. తమిళనాడులోనే కాదు… దేశవ్యాప్తంగా చర్చనీయాంసం అయింది. జయలలిత మృతి తర్వాత తమిళనాడుకు ఇక ఆమె జయలలిత అనుకున్నారు. అన్నాడీఎంకే పార్టీ మొత్తం ఆమె వెనుకే ఉంది. అయితే.. బీజేపీ ప్రోత్సాహంతో మొదట పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేశారు. ఆ సమయంలో కూడా.. ఎమ్మెల్యేలంతా ఆమె వైపే ఉన్నారు. ఆ సమయంలో అనూహ్యంగా ఆమెపై ఉన్న అక్రమాస్తుల కేసుల్లో తీర్పు రావడంతో ప్రమాణస్వీకారానికి అంతా సిద్ధం చేసుకుని కూడా జైలుకు పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారాయి. అన్నాడీఎంకే కూడా ఆమెను దూరం పెట్టింది. శిక్షాకాలం పూర్తవుతున్న కారణంగా ఇరవై ఏడో తేదీన ఆమె విడుదలవుతారని ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.

ఆస్పత్రిలో ఉన్నంత కాలం ఎప్పుడూ పెద్దగా అనారోగ్యానికి గురి కాని.. శశికళ … విడుదలవుతున్న సమయంలో ఆస్పత్రి పాలవడం ఆమె అభిమానుల్ని కలవరపాటుకు గురి చేస్తోంది. అదీ కూడా పరిస్థితి విషమంగా మారడం… ఇబ్బందికి గురి చేస్తోంది. ప్రస్తుతం బలమైన … జనాకర్షక నేతలు లేని తమిళనాడులో… స్టాలిన్‌కు ఆమె గట్టి పోటీ అవుతుందన్న ప్రచారమూ జరిగింది. అయితే.. ఇప్పుడు కోలుకున్నా.. ఆమె యాక్టివ్‌గా రాజకీయాల్లో పాల్గొనడం సాధ్యం కాదన్న చర్చ నడుస్తోంది. ముందుగా ఆమె సంపూర్ణ ఆరోగ్యంగా జైలు నుంచి విడుదలై రావాలని తమిళనాడులో ఆమె ఫ్యాన్స్ పూజలు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close