నిమ్మగడ్డ ఆదేశాలకు పెద్దిరెడ్డి కట్టుబడ్డారు..!

తనపై ఆదేశాలు ఇచ్చే ముందు అమలు అవుతాయో లేదో చూసుకోవాలి..! .. ఇది తనను హౌస్ అరెస్ట్ చేయాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాల గురించి తెలిసిన తర్వాత మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు.

ఎస్‌ఈసీ ఆదేశాలకు కట్టుబడి ఉంటా….వ్యతిరేకంగా మాట్లాడను. అక్రమాలకు పాల్పడను..అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనను..! ..ఇది మూడు గంటల తర్వాత మీడియాను పిలిచి మరీ మాట్లాడిన మాటలు.

ఈ మధ్యలో ఏమయింది..? ఏమయిందో తెలియడం లేదు కానీ… పెద్దిరెడ్డి లాంటి పెద్దమనిషిని పూర్తిగా బెండ్ అయ్యేలా పరిణామాలు జరిగాయని మాత్రం సులువుగానే అర్థం చేసుకోవచ్చు. పెద్దిరెడ్డి ఉద్యోగుల్ని బెదిరిస్తూ ఉండటం.. ఎస్‌ఈసీపై దారుణమైన వ్యాఖ్యలు చేస్తూండటంతో ఈ నెల 21వ తేదీ వరకూ ఆయనను హౌస్‌ అరెస్ట్‌లో ఉంచారని ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీకి స్పష్టమైన సూచనలు వెళ్లాయి. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే మంత్రి పెద్దిరెడ్డి ఆవేశపడిపోయారు. వెంటనే ప్రెస్ మీట్ పెట్టి.. మళ్లీ నిమ్మగడ్డను చెడామడా తిట్టేశారు. నిమ్మగడ్డ ఆదేశాల్ని ఖాతరు చేయాల్సిన అవసరంలేదని.. మంత్రిని ఇంట్లో పెట్టాలనే ఆలోచన దుర్మార్గమని విమర్శించారు. తనపై ఆదేశాలు ఇచ్చే ముందు అమలవుతాయో లేదో చూసుకోవాలని.. నిమ్మగడ్డ ఆదేశాలను ఖాతరు చేయాల్సిన పనిలేదని తేల్చేశారు. నిమ్మగడ్డకు ప్రాయశ్చిత్తం తప్పదని పిచ్చి ముదిరిందని హెచ్చరించి వెళ్లిపోయారు.

అయితే మూడు గంటల తర్వాత మీడియాను ఆయన ఇంటి వద్దకు రావాలని ఆహ్వానించారు. వెళ్లిన వారికి పెద్దిరెడ్డి షాకిచ్చారు. తడబడుతూ.. సిగ్గుపడుతూ ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉంటామని ప్రకటించారు. వ్యతిరేక వ్యాఖ్యలు చేయనని చెప్పుకొచ్చారు. అయితే ఆ తర్వతా మళ్లీ నిన్నటి వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని .. రేపు .. ఎల్లుండి కూడా ఉంటానని చెప్పుకొచ్చారు. చంద్రబాబు వద్ద నిమ్మగడ్డ బంట్రోతులా పనిచేస్తున్నారని మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసి కారెక్కి ఇంటికి వెళ్లిపోయారు.

అయితే నిమ్మగడ్డ ఆదేశాలపై హైకోర్టుకు వెళ్లాలన్న ఆలోచనను వైసీపీ వర్గాలు చేశాయని చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టులో సానుకూల ఫలితం వచ్చే అవకాశం లేదని న్యాయనిపుణులు చెప్పడంతో వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఒక వేళ ఆదేశాలు అమలు చేయకుండా పెద్దిరెడ్డి ఇష్టం వచ్చినట్లుగా తిరిగితే.. బలవంతంగా హౌస్ అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోవడం కన్నా… ఆదేశాలు పాటించడం మేలన్న సూచనలు పెద్దిరెడ్డికి పంపారు. దాంతో ఆయన కట్టుబడి ఉంటానని ప్రకటించాల్సి వచ్చిందంటున్నారు. ఉదయం ఆదేశాలు ఎలా అమలవుతాయో చూస్తానన్న ఆయన… సాయంత్రానికి కట్టుబడి ఉంటానన్నట్లుగా స్టోరీ మారిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

‘విద్య వాసుల అహం’ రివ్యూ: మ‌ళ్లీ పాత పెళ్లి కథే!

తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా' ప్రతి వారం ఎదో ఒక కొత్త సినిమా ఉండేలా ప్లాన్ చేస్తుకుంటుంది. ఈ వారం రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ నటించిన 'విద్య వాసుల అహం' ప్రేక్షకులు...

కడప కోర్టు తీర్పు రాజ్యాంగవిరుద్ధంగా ఉందన్న సుప్రీంకోర్టు

వివేకా హత్యపై మాట్లాడవద్దని కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు మండిపడింది. కడప కోర్టు ఉత్తర్వులు సుప్రీం తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని.. వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని స్పష్టం...

కౌంటింగ్‌లో సహకరించాలన్నట్లుగా ఈసీని బెదిరిస్తున్న సజ్జల !

అయిందేదో అయిపోయింది.. ఇక తప్పు దిద్దుకో అని ఈసీని హెచ్చరించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈసీ ఏం తప్పు చేసిందో.. ఎలా దిద్దుకోవాలనుకుంటున్నారో ఆయన పరోక్షంగానే తన మాటలతో సందేశం పంపారు. అదేమిటంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close