చెన్నైలో చేతులెత్తేసిన టీమిండియా

ఆస్ట్రేలియాని.. అందునా ఆ దేశంలో ఓడించి – నివ్వెర ప‌రిచిన టీం ఇండియా – స్వ‌దేశంలో ఇంగ్లండ్ పై చేతులెత్తేసింది. చెన్నైలోని తొలి టెస్టులో హాట్ ఫేవ‌రెట్ గా బ‌రిలోకి దిగిన భార‌త్‌… ఇంగ్లిష్ జ‌ట్టు చేతిలో.. 227 ప‌రుగుల తేడాతో ఘోర ప‌రాజ‌యం పాలైంది. చివ‌రి రోజు.. వికెట్లు కాపాడుకోలేక త‌ల‌వొంచింది. ఫ‌లితంగా తొలి టెస్టులో భార‌త్ ఓట‌మి పాలైంది. టెస్టు మ్యాచ్ గెల‌వాలంటే చివ‌రి రోజు 381 ప‌రుగులు చేయాలి. ఓట‌మి త‌ప్పించుకోవాలంటే చేతిలో ఉన్న 9 వికెట్ల‌తో చివ‌రి బంతి వ‌ర‌కూ పోరాడాలి. కానీ.. ఇవి రెండూ చేయ‌లేక‌పోయింది భార‌త్‌. ఒక వికెట్ న‌ష్టానికి 39 ప‌రుగుల‌తో.. ఐదో రోజు పోరాటం ప్రారంభించిన భార‌త్‌కు.. ఆండ‌ర్స‌న్, జాక్ లీచ్‌ కోలుకోలేని దెబ్బ‌కొట్టారు. తొలుత పుజారా (15)ని లీక్ అవుట్ చేశాడు. అక్క‌డి నుంచి వికెట్ల ప‌త‌నం ప్రారంభ‌మైంది. గిల్ (50) ఆండ‌ర్స‌న్ వేసిన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అదే ఓవ‌ర్లో రెహానే (0) కూడా వెనుదిరిగాడు. అద్భుత‌మైన ఫామ్ లో ఉన్న పంత్ (11) ఈసారి.. వికెట్ల‌ని కాచుకోలేక‌పోయాడు. ఓ ద‌శ‌లో లంచ్‌కి ముందే భార‌త్ ఆలౌట్ అవుతుంద‌నిపించింది. అయితే.. కోహ్లి (72), అశ్విన్ (9) వికెట్ల ప‌త‌నాన్ని కాసేపు అడ్డుకున్నారు. వీళ్లు కూడా.. త్వ‌ర‌త్వ‌ర‌గా అవుటై పెవిలీయ‌న్ చేర‌డంతో భార‌త్ ఓట‌మి త‌ప్ప‌లేదు. చివ‌రికి 192 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది. జాక్ కి 4, ఆండ‌ర్స‌న్‌కి 3 వికెట్లు ద‌క్కాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close