రైతులతో పెట్టుకున్న బీజేపీ..! పంజాబ్‌లో అడ్రస్ గల్లంతు..!

వ్యవసాయ చట్టాలు భారతీయ జనతాపార్టీ పునాదుల్ని కదిలించేశాయని పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికలు నిరూపిస్తున్నాయి. పార్టీల వారీగా జరిగిన పంజాబ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఒకటి.. రెండు.. మూడు స్థానాల్లో కనిపించలేదు. ఏకంగా నాలుగో స్థానంలో నిలిచింది. అత్యధిక శాతం వార్డుల్లో కనీసం డిపాజిట్లు దక్కలేదు. పంజాబ్‌లో 8 మున్సిపల్‌ కార్పొరేషన్లలో అదే పరిస్థితి. రెండో స్థానంలో భారతీయ జనతా పార్టీతో నిన్నామొన్నటి వరకూ పొత్తులో ఉన్న శిరోమణి అకాలీదశ్ నిలిచింది. అయితే పేరుకు మాత్రమే… రెండో స్థానం. ఎక్కడా ఒక్క కార్పొరేషన్ కానీ.. మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో కానీ గెలిచిన దాఖలాలు లేవు . కొన్ని వార్డుల్లో మాత్రం గెలిచింది. ఆమ్ ఆత్మీ పార్టీ మూడో స్థానం లో నిలిచింది. నాలుగో స్థానంలో అతి కష్టం మీద భారతీయ జనతా పార్టీ నిలిచింది.

వ్యవసాయ చట్టాల విషయంలో… ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్, హర్యానాతోపాటు ఉత్తరాదికి చెందిన రైతుల ఆందోళనలు… ఈ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపించాయి. కేంద్ర ప్రభుత్వం సమస్యను పరిష్కరించకపోగా.. రైతులపై ఖలిస్థాన్ వేర్పాటు వాదుల ముద్ర వేసే ప్రయత్నం చేస్తోంది. ఈ పరిణామాలన్నీ పంజాబ్ రైతుల ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో బయటకు వచ్చేలా చేశాయంటున్నారు. నిజానికి అక్కడ భారతీయ జనతా పార్టీ సింగిల్‌గా అధికారంలోకి వచ్చేంత బలంగా లేదు. కానీ దశాబ్దాలుగా శిరోమణి అకాలీదళ్‌తో పొత్తులో ఉంది. ఆపార్టీతో కలిసి అధికారం పంచుకునేది. ఇప్పుడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. అకాలీదళ్ కూడా బీజేపీకి కటీఫ్ చెప్పింది.

రైతుల ఆగ్రహం ఒక్క పంజాబ్‌లోనే ఉందా.. లేక దేశ వ్యాప్తంగా ఉందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంది. ఎలా లేదన్నా ఈ ఫలితాలు దేశం^మొత్తం మీద ఉన్న రైతులపై ప్రభావం చూపిస్తాయని అంటున్నారు. దేశభక్తి ఎజెండాతో ఎప్పుడూ ఎన్నికలకు వెళ్లే బీజేపీకి రైతుల ఆగ్రహం ఇబ్బందికరమే. ఈ పరిస్థితి దేశం ప్రభావం చూపితే… భారతీయ జనత ాపార్టీకి గడ్డు కాలం రావడం ఖాయమేనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. బీజేపీ భావోద్వేగాల మీద గెలుస్తోందని… అదే రైతుల భావోద్వేగం దాన్ని డామినేట్ చేస్తే బీజేపీ అడ్రస్ గల్లంతవుతుందని పోల్ విశ్లేషకుల అంచనాలు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close