దుర్గగుడిలో అవినీతి ఆనకొండలు..! కానీ చిన్న చేపలే బలి..!

విజయవాడ దుర్గగుడిలో ఏసీబీ మూడు రోజుల పాటు చేసిన సోదాల్లో… అడుగుకో అక్రమం బయటపడటంతో ఇప్పుడు దాన్ని కింది స్థాయి ఉద్యోగులకు చుట్టేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఏసీబీ నివేదిక ఆధారంగా ఇప్పటి వరకూ 13 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇందులో ఐదుగురు సూపరిండెంటెట్లు కూడా ఉన్నారు. మరికొంత మందిపైనా చర్య తీసుకునేందుకు రంగం సిద్ధమయిందన్న ప్రచారం జరుగుతోంది. ఏసీపీ అందించిన ప్రాథమిక నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకుంటున్నామని.. ముందు ముందు మరింత మంది కీలక వ్యక్తులపై చర్యలు ఉంటాయని ప్రభుత్వర్గాలు చెబుతున్నాయి. ఇలా సస్పెన్షన్ వేటు వేస్తోంది ఈవో సురేష్ బాబు. అసలు ఆయనపైనే అనేకానేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆలయంలో జరిగే ప్రతీ వ్యవహారం ఆయన కనుసన్నల్లోనే జరగుతుతుంది.

ప్రతీ దానికి ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే.. అనూహ్యంగా ఏసీబీ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం.. కింది స్థాయి ఉద్యోగులపైన మాత్రమే వేటు వేస్తున్నారు. అదే సమయంలో ఈవో సురేష్ బాబుపై దేవాదాయశాఖ కమిషనర్‌ అర్జునరావు నేరుగా ఆరోపణలు చేస్తున్నారు. మ్యాక్స్ అనే సంస్థకు సెక్యూరిటీ టెండర్లను అప్పగించారు. అందులో అనేక అవకతవకలు జరిగాయి. టెండర్ ఆమోదం పొందకపోయినా మ్యాక్స్ సంస్థకు పెద్ద ఎత్తున నిధులు చెల్లించారంటూ అర్జునరావు సురేష్ బాబుపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీంతో మొత్తం వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతోంది. తాడేపల్లి ప్యాలెస్‌లో దుర్గగుడి అవినీతి వ్యవహారంపై సెటిల్మెంట్ జరిగిందని టీడీపీ, జనసేన ఆరోపణలు ప్రారంభించాయి.

స్వరూపానంద స్వామి, సజ్జల రామకృష్ణారెడ్డితో.. దుర్గగుడి ఈవో సురేష్‌బాబు బేరం కుదుర్చుకున్నారని జనసేన నేత పోతిన మహేష్ ఆరోపించారు. మంత్రి వెల్లంపల్లిని… ఈవో సురేష్ బాబును స్వరూపానంద కాపాడుతున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. అయితే దుర్గగుడిలో ఏసీబీ దాడులు చేయడం అనేది కింది స్థాయి అధికారులు తీసుకునే నిర్ణయం కాదని.. పై స్థాయిలో చేస్తారని.. ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ వ్యూహం ఉందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి దుర్గగుడిలో అవినీతి మూలవిరాట్టు ఎవరో కనిపెడితే కానీ అవినీతికి అంతం పడదు. లేకపోతే.. యధావిధిగా అవినీతి మయంగానే అమ్మవారి ఆలయం ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close