కృతి శెట్టి: ఆరు నుంచి… అర‌వై ల‌క్ష‌ల వ‌ర‌కూ

`ఉప్పెన‌` నుంచి తొలి పోస్ట‌ర్ ఎప్పుడైతే బ‌య‌ట‌కు వ‌చ్చిందో అప్పుడే కృతి శెట్టిపై క‌ళ్లన్నీ ప‌డిపోయాయి. నీ క‌న్ను నీలి స‌ముద్రం.. పాట టీజ‌ర్ తో – కృతి శెట్టి ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. సినిమా బ‌య‌ట‌కు రాకుండానే కొత్త ఆఫ‌ర్లు చేతికందాయి. ఇప్పుడు కృతి డేట్లు, టాలీవుడ్ లో హాట్ కేకులు. తాజాగా కృతి పారితోషికం అర‌కోటికి చేరింద‌ట‌. అర‌వై ల‌క్ష‌లు కూడా డిమాండ్ చేస్తోంద‌ని టాక్‌. అయితే.. `ఉప్పెన‌`కు కృతికి అందిన పారితోషికం ఎంతో తెలుసా? కేవ‌లం ఆరు ల‌క్ష‌లు. మైత్రీ మూవీస్‌, అందులోనూ విజ‌య్ సేతుప‌తి లాంటి స్టార్ ఉన్న సినిమా. అందుకే కృతి కూడా పెద్ద‌గా డిమాండ్ చేయ‌కుండా.. `అవ‌కాశం రావ‌డ‌మే గొప్ప‌` అనుకుని ఈ సినిమా ఒప్పేసుకుంది. ఆ సినిమాతోనే… కృతి పాపుల‌ర్ అయిపోయింది కూడా. ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా కృతితో మ‌రో రెండు సినిమాల‌కు అగ్రిమెంట్లు చేయించుకుంది మైత్రీ. అయితే ఈసారి మాత్రం కృతి అడిగినంత ఇవ్వాల్సిందే. త‌న డిమాండ్ అలాంటిది. దర్శ‌కుడు బుచ్చికి కూడా పెద్ద‌గా పారితోషికం ముట్ట‌లేదు.కేవ‌లం ఆయ‌న‌.. నెల‌వారీ జీతంపైనే ఈ సినిమా చేసిన‌ట్టు టాక్. అయితే.. సినిమా విడుద‌లై, మంచి లాభాలు వ‌చ్చాక మాత్రం బుచ్చికి పెద్ద‌మొత్తంలోనే పారితోషికం ఇచ్చి సంతృప్తి ప‌రిచారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీని జగన్ కట్టడి చేయాలని అసదుద్దీన్ సలహాలు..!

మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు ఏపీలో అడుగు పెట్టారో ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. ఆప్తమిత్రోం జగన్‌పై పడిన మత ముద్ర విషయంలో .. ఆదుకుని మున్సిపల్ ఎన్నికల్లో ఆయనపై ఆ ప్రభావం...

లార్డ్స్‌లో భారత్ కోసం ఎదురు చూస్తున్న టెస్ట్ వరల్డ్ కప్..!

ప్రపంచ టెస్ట్ చాంపియన్లుగా అవతరించడానికి భారత్‌కు గోల్డెన్ చాన్స్ వచ్చింది. లార్డ్స్ వేదికగా జూన్ 18 నుంచి ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్‌లో భారత్ న్యూజిలాండ్‌తో తలపడనుంది. అహ్మదాబాద్ లో జరిగిన నాలుగో...

బెజవాడలో టీడీపీ వర్సెస్ టీడీపీ గ్రూప్ తగాదాలు

విజయవాడలో టీడీపీ నాయకులు .. ఎన్నికలకు ముందే ఆ పార్టీని ఓడగొడుతున్నారు. అధికార పార్టీ దూకుడుని తట్టుకుని ఎంతో కొంత గెలుపు చాన్స్ ఉందని అనుకుంటున్న బెజవాడ నేతలు.. పోలింగ్...

బాలకృష్ణ కొడితేనే వైరల్.. కొట్టకపోతే నార్మల్..!

హిందూపురంలో నందమూరి బాలకృష్ణ అభిమానిపై చేయి చేసుకున్నారు. నిజంగా ఆయన కొట్టకపోతేనే వార్త. కొడితే వార్త ఎందుకవుతుంది. పబ్లిక్‌లోకి వచ్చిన ప్రతీసారి తన చేతికి పని చెప్పడం ఆయనకు అలవాటు. ఆయన చేతి...

HOT NEWS

[X] Close
[X] Close