బీజేపీ ఆఫర్‌ను కోమటిరెడ్డి పరిశీలిస్తున్నారట..!

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఒక రోజు కాంగ్రెస్ పార్టీకి..మరో రోజు బీజేపీకి తన వాయిస్ అప్పగిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల మొదటి రోజు.. సీఎల్పీలో హడావుడి చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. రెండో రోజు బీజేపీ తరపున వకాల్తా పుచ్చుకున్నారు. టీఆర్ఎస్‌ను ఓడించేది బీజేపీనేనని మళ్లీ స్టేట్ మెంట్ ఇచ్చారు. అంతే కాదు.. బీజేపీలోకి రమ్మని సంప్రదింపులు జరుగుతున్నాయని.. నాగార్జునసాగర్‌ నుంచి పోటీ చేయాలని.. కొన్నిరోజులుగా బీజేపీ నేతలు అడుగుతున్నారని చెప్పుకొచ్చారు. పోటీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని .. తాను బీజేపీ నుంచి పోటీచేస్తే జానారెడ్డికి మూడో స్థానమే వస్తుందని జోస్యం చెప్పారు. సాగర్‌లో బీజేపీ బలమైన అభ్యర్థి కోసం వెదుకుతోంది.

కానీ… ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని ఎమ్మెల్యేగా నిలబెడుతుందని ఎవరూ అనుకోవడం లేదు. అయితే ఆర్థికంగా బలవంతుడైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బలమైన అభ్యర్థి అవుతారన్న చర్చ మాత్రం జరుగుతోంది. ఆయన కాంగ్రెస్ పార్టీకి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి.. పోటీ చేయించే అంత వ్యూహం బీజేపీ అమలు చేస్తుందా.. అన్న సందేహం కూడా ఉంది. ఎందుకంటే బీజేపీలోనే టిక్కెట్ కోసం పెద్ద ఎత్తున పోటీ ఉంది. నేతలు పోటీలు పడి ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోమటిరెడ్డిని బతిమిలాడి.. పార్టీలోకి తీసుకుని టిక్కెట్ ఇస్తే.. ఆ నేతలు కలిసి పని చేస్తారా అన్నది బీజేపీ వర్గాలకు ఉన్న అనుమానం.

మొత్తానికి రాజగోపాల్ రెడ్డి నోట బీజేపీ మాట రావడం ఇదే మొదటి సారి కాదు. గతంలో ఢిల్లీ పెద్దల్ని కలిసి వచ్చాడు. అయితే బీజేపీలో తానే సీఎం అభ్యర్థి చెప్పుకోవడంతో వారు పక్కన పెట్టేశారు. అప్పుడు మళ్లీ కాంగ్రెస్ పాట పాడారు. సోదరుడు కోమటిరెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వకపోతే బీజేపీలోకి పోతానని బెదిరింపులు కూడా చేశారు. ఇప్పుడు మళ్లీ సాగర్ ఎన్నికలకు ముందు ప్రారంభించారు. ఇలాంటి నిలకడ లేని నేతను బీజేపీ సీరియస్‌గా ఆహ్వానిస్తుందా … పోటీకి పెడుతుందా..అన్నది ఆ పార్టీలోనే కొంత మంది నేతలకు ఉన్న సందేహం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close