సాగర్ బీజేపీ అభ్యర్థి రేసులో తీన్మార్ మల్లన్న..!?

నాగార్జున సాగర్‌లో బలమైన అభ్యర్థిని నిలబెట్టడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఎవరెవరి దగ్గరకో వెళ్తున్నాయి. ఇప్పుడు… ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లగొండ స్థానం నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ వద్దకు చేరింది. నవీన్ హఠాత్తుగా ఢిల్లీలో ప్రత్యక్షమవడంతో.. అందరూ బీజేపీ పెద్దలతో చర్చలకేనని అనుకుంటున్నారు. అయితే ఆయన మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. మరో వైపు.. సాగర్ ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చేసింది. నామినేషన్లు కూడా మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో అభ్యర్థిని ఖరారు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీ తరపున పోటికి రెడీగా ఉన్న వారు… బలవంతులు కాదని డిసైడయ్యారు. అందుకే.. వారెవరికీ టిక్కెట్ ఇవ్వదల్చుకోలేదు. కొత్త వారి కోసం చూస్తున్నారు.

టీఆర్ఎస్ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్న వారిలో .. టిక్కెట్ ఖరారైన తర్వాత ఎవరైనా బీజేపీ వైపు రాకపోతారా అన్న ఆశలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన చిన్నపరెడ్డి, కోటిరెడ్డి టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్నారు. అయితే యాదవ సామాజికవర్గానికి అదీ కూడా.. నోముల తనయుడికే టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగడంతో.. వారితో బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. రెండో స్థానం సాధించిన తీన్మార్ మల్లన్నకు సోషల్ మీడియాలో క్రేజ్ రావడంతో… ఆయన వైపు కూడా చూస్తున్నారు. టీఆర్ఎస్ ఖరారు చేసిన తర్వాతనే అభ్యర్థిని ఖరారు చేయాలన్న ఆలోచన చేస్తున్నారు.

మొత్తంగా బీజేపీ..సొంత పార్టీలో ని అభ్యర్థుల్ని నమ్ముకోవడానికి సిద్ధంగా లేరు. టిక్కెట్ మాత్రం. చివరి క్షణంలో బయట నుంచి వచ్చే వారికే ఇవ్వనున్నారు. ఆ బయట వ్యక్తి ఎవరనేదే ఇప్పుడు సస్పెన్స్. టీఆర్ఎస్ నేత అవుతారా..లేకపోతే టీఆర్ఎస్‌ను చాలెంజ్ చేసిన తీన్మార్ మల్లన్న అవుతారా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. తీన్మార్ మల్లన్న సొంత పార్టీ ఆలోచనల్లో ఉన్నారన్న ప్రచారం కూడా గట్టిగా జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్పుడే ఓటమికి కారణాలు చెప్పేసిన మంత్రి..!?

సర్వేలన్నీ కూటమిదే అధికారమని తేల్చడం, పోలింగ్ శాతం పెరగడంతో వైసీపీ నేతలు అప్పుడే ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు. కారణం ప్రభుత్వ వ్యతిరేకత కాదని, సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తున్నారు. సాధారణ...

ఏపీలో ముగిసిన పోలింగ్ …పోలింగ్ పెరగడంతో వైసీపీలో టెన్షన్..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాలో వైసీపీ , టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు...

పోలింగ్ తగ్గించాలనే వైసీపీ “దాడుల ప్లాన్” పెయిల్ !

వీలైనంత వరకూ పోలింగ్ తగ్గించాలని వైసీపీ ముందుగానే ప్లాన్ చేసుకుంది. కీలకమైన నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కాక ముందే టీడీపీ ఏజెంట్లపై దాడులు చేసి వాటిని విస్తృతంగా ప్రచారం చేయాలనుకున్నారు. అనుకున్నట్లుగా...

ఆ చెంపదెబ్బ వైసీపీ ఎమ్మెల్యేకి కాదు వైసీపీకే !

ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అ పెద్ద అపశకునం వైసీపీకి వచ్చింది. అది కూడా తమ ఎమ్మెల్యేకు చెంపదెబ్బ రూపంలో. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెంప...

HOT NEWS

css.php
[X] Close
[X] Close