టీఆర్ఎస్‌లో కోవర్టుల్ని పట్టేసిన కేసీఆర్..!

తెలంగాణ రాష్ట్ర సమితిలో కోవర్టులున్నారు. సొంత పార్టీలో ఉంటూ..ఇతర పార్టీలు ఎదగడానికి సాయం చేస్తున్నారు. సొంతపార్టీని బద్నాం చేస్తున్నారు. సీక్రెట్ ఆపరేషన్లు నిర్వహించి… తమ పార్టీని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వారు ఎవరెవరో కేసీఆర్‌కు రిపోర్ట్ అందింది. దానికి సంబంధించి .. తమకు బాగా తెలిసిన మీడియాకు.. లీకులు ఇస్తున్నారు. ఇప్పటికే ఓ మంత్రి.. కొంత మంది ఎమ్మెల్యేలపై విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. ఆ మంత్రి ఎవరో.. ఆ ఎమ్మెల్యేలు ఎవరో టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా పేర్లు కూడా ప్రచారం అవుతున్నాయి. అందరికీ తెలుసు కానీ.. ఎవరి పేర్లనూ వారు బయటపెట్టడం లేదు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు… కేసీఆర్‌కు కొత్త శక్తినిచ్చింది. వాటిల్లో ఓడిపోయి ఉంటే పరిస్థితి తేడాగా ఉండేది. అయితే ఎప్పుడూ లేనిది హైదరాబాద్ స్థానంలోనూ గెలవడంతో కేసీఆర్ లో పాత రాజకీయ నాయకుడు బయటకు వచ్చారు. పార్టీకి ద్రోహం చేయడానికి ప్రయత్నించిన వారి జాబితాను రెడీ చేసుకున్నారు. ఇంటలిజెన్స్ వర్గాలు ఎప్పటికప్పుడు ఇచ్చిన నివేదికల ప్రకారం… ఓ మంత్రి .. పలువురు ఎమ్మెల్యేలు…బీజేపీ అభ్యర్థులకు మాట సాయం చేశారు. టీఆర్ఎస్‌కు ఇబ్బంది కలిగేలా చేశారు. కొంత మంది లోపాయికారీగా ఇతర పార్టీలతో అవగాహన పెట్టుకుటున్నారు. ఈ జాబితాలో కేసీఆర్ అనుమానించేవారితో పాటు.. నమ్మకంగా ఉండేవారు కూడా ఉన్నారని అంటున్నారు.

కొద్ది రోజుల కిందట సీఎం పీఆర్వో గా ఉండే వ్యక్తిని తొలగించారు. ఆ తొలగింపు వెనుక కూడా.. చాలా కథ ఉందని… ఆయన అవినీతి ఒక్కటే కాదని… టీఆర్ఎస్‌లో రెబెల్స్‌గా మారే ప్రమాదం ఉన్న కొంత మంది నేతలకు… కేసీఆర్ సమాచారం ఇస్తున్నది ఆ పీఆర్వోనేనని తేలడంతోనే ఆయనను పంపేశారని అంటున్నారు. టీఆర్ఎస్‌లో కోవర్టులపై ఇప్పుడు మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. వారెవరన్నదానిపై కేసీఆర్ ఏదో చర్య తీసుకుంటూనే కానీ బయటపడదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close