సాగర్ బైఎలక్షనే ప్రైవేట్ టీచర్లను కాపాడుతోంది..!

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్రైవేటు టీచర్ల కష్టాలు కనిపించాయి. వెంటనే వారిని ఆదుకోవడానికి ఏర్పాట్లు చేసేశారు. అయితే ఇలా ఆదుకునే ఆలోచన చేయడానికి నాగార్జున సాగర్ ఉపఎన్నికే కారణంగా చెప్పుకోవచ్చు. ఉపఎన్నిక జరుగుతున్న నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఓ ప్రైవేటు టీచర్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారు. రెండు రోజులకే.. ఆయన భార్య కూడా ఆత్మహత్య చేసుకుంది. అదే సమయంలో… ప్రైవేటు టీచర్లు పెద్ద ఎత్తున సెల్ఫీ వీడియోల ద్వారా తమను ప్రభుత్వం ఆదుకోవాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలా సిరిసిల్లకు చెందిన ఓ ఉపాధ్యాయుడు పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. ఇప్పటికే ప్రైవేటు టీచర్లందరూ తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

స్కూళ్లు తెరవకుండా నిలిపివేయడంతో వారికి ఉపాధి కరువయింది. ఏడాది నుంచి ఇదే పరిస్థితి ఉంది. వారందర్నీ ఆదుకోవాలన్న డిమాండ్లు చాలా కాలం నుంచి ఉన్నాయి. కానీ ఎప్పుడూ కేసీఆర్.. స్పందించలేదు. ఇప్పుడు ఆత్మహత్యలు ప్రారంభం కావడంతో స్పందించక తప్పలేదు. ప్రైవేటు టీచర్ భార్య నాగార్జునసాగర్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిన గంటలోనే… ప్రైవేటు టీచర్లకు రూ. రెండువేల సాయం… నెలకు పాతిక కేజీల బియ్యం ఇవ్వాలని నిర్ణయించారు. అయితే.. ఒక్క సారే ఇస్తారని అనుకున్నారు.

కానీ మళ్లీ స్కూళ్లు తెరిచే వరకూ.. ప్రైవేటు టీచర్లందరికీ… రూ. రెండువేల సాయం … రూ. పాతిక కేజీల బియ్యం ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో ప్రైవేటు టీచర్లు కాస్త ఊపిరి పీల్చుకునే పరిస్థితి వస్తోంది. ఉపఎన్నికల పుణ్యమా అని ప్రభుత్వం ప్రైవేటు టీచర్లను పట్టించుకుంటోందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఎక్కువ మంది ..స్కూళ్లు తెరవాలనే డిమాండ్‌నే వినిపిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం దానికి సుముఖంగా లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close