మీడియా వాచ్ : మైహోమ్ భజనలో రెండు చానళ్లు..!

తెలుగులో రెండు చానళ్లు పులకించిపోతున్నాయి. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ గురించి … చెప్పిందే చెప్పి .. చూసేవాళ్లకు ఇదేం చోద్యం అనిపించేలా చేస్తున్నాయి. ఆ రెండు చానళ్లలో ఒకటి టీవీ9, రెండోది ఎన్టీవీ. మైహోమ్ సంస్థను స్థాపించి 35 ఏళ్లు అయిందని… ఆ సంస్థ ప్రతినిధులు ఓ ప్రెస్‌మీట్ పెట్టారు. అంతే.. అంత కంటే మహాభాగ్యం దొరకదని… గంటల తరబడి ఆ సంస్థ గురించి… బ్రేకింగ్‌లతో సహా హడావుడి చేశాయి రెండు చానళ్లు. ఓ వ్యాపార సంస్థ మచ్చలేనిదని చెప్పడానికి ఆ రెండు చానళ్లు చాలా కష్టపడ్డాయి.

మైహోమ్ సంస్థపై ఎన్నెన్ని వివాదాలున్నాయో.. ఆ రంగంలో ఉన్న వారికే తెలుసు. ఆ సంస్థ భూలావాదేవీలపై ఉన్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. కానీ.. ఒక్కటంటే ఒక్కటి కూడా ఈ సందర్భంగా ఆ రెండు చానళ్లు ప్రస్తావించలేదు. తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితమైనది మాత్రమే కావడం కాదు… ఆ రెండు చానళ్లలో పెట్టుబడులు కూడా పెట్టింది. ఫలితంగా ఆ సంస్థకు సంబంధించి చిన్న మరక కూడా కనిపించకుండా కవర్ చేస్తూ…గొప్పగా ఎదిగిపోతోందని పబ్లిసిటీ చేయడానికి మొహమాట పడలేదు. ఆ సంస్థ చేపట్టిన మైహోమ్ చేపట్టిన ఓ ప్రాజెక్టు ఇప్పుడు వివాదాల్లో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించిన కేసు ఉంది. తెలంగాణ సర్కార్ పట్టించుకోకపోవడంతో నేరుగా ఎన్జీటీనే రంగంలోకి దిగి విచారణ జరుపుతోంది.

టీవీ9 అయితే మరింత ముందుకెళ్లి… మైహోమ్ సంస్థకు మేలు చేసేందుకా అన్నట్లుగా… అంతకు నాలుగు రోజులు ముందుగా ప్రి లాంచ్ ఆఫర్ల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు మోసం చేస్తున్నారని వారి నమ్మోద్దంటూ ప్రచారం హోరెత్తించింది.కానీ అదేమీ నిబంధనలకు విరుద్ధమని ఎక్కడా తేలలేదు. ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఎవరిపైనా కేసులు నమోదు చేయలేదు. కానీ ఆయా చోట్ల ఇళ్లు కొనాలనుకునేవారిని భయపెట్టి… ఆపడానికి ప్రయత్నించి… వారందర్ని మైహోమ్ వైపు మళ్లించే ప్రయత్నం చేశారని సులువుగానే అర్థం చేసుకోవచ్చని ఇండస్ట్రీ నిపుణులు అంటున్నారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి మీడియా వెళ్తే. ..వారి వ్యాపారాల కోసం ఎలాంటి స్థితికైనా దిగజారుతారని… లేని ఇమేజ్ కోసం ప్రయత్నిస్తారని.. తాజా వార్తల వల్ల తెలుసుకోవచ్చు. ప్రభుత్వం మారిన తర్వాత మైహోమ్ ప్రాజెక్టులుచేపట్టిన భూములపై అనేక వివాదాలు ఏర్పడతాయని దాని వల్ల వాటిని కొనుగోలు చేసిన వారు ఇబ్బంది పడతారని.. కాంగ్రెస్ నేతలు చాలా సార్లు ఆరోపించారు. వీటన్నింటినీ దాచి పెట్టి… ఆ రెండు చానళ్లు.. బాకా ఉదాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎర్రబెల్లి సైలెన్స్ ఎందుకబ్బా..!!

బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కు అత్యంత సన్నితుడిగా పేరొందిన ఎర్రబెల్లి దయాకర్ ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఆ మధ్య ఆయన కాంగ్రెస్ లో చేరుతారని జోరుగా...

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close