షర్మిల పార్టీకి కూడా గౌరావాధ్యక్షురాలే..!?

వైఎస్ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి .. షర్మిలతో పాటే ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లుగా ఉంది. ఖమ్మంలో ఏర్పాటు చేసిన సంకల్పసభకు వెళ్లి ప్రారంభవాక్యాలు పలికిన ఆమె… ఇప్పుడు ఉద్యోగదీక్షలోనూ కుమార్తెతో పాటుగా కూర్చున్నారు. వైసీపీతో సంబంధం లేకుండా.. సొంతంగా పార్టీ పెట్టుకుంటున్న షర్మిల వెంటనే.. వైసీపీ గౌరవాధ్యక్షురాలు తిరగడం.. ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం ఇప్పటికే చర్చనీయాంశం అయింది. జగన్ కంటే షర్మిలకే వైఎస్ విజయలక్ష్మి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో… విజయలక్ష్మి వేస్తున్న అడుగులు.. కూడా ఆ వాదనకు బలం చేకూర్చేలా ఉన్నాయి.

నిజానికి ఓ పార్టీకి గౌరవాధ్యక్షురాలిగా ఉన్నందున.. మరో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం కరెక్ట్ కాదని విజయలక్ష్మికి చెప్పే ఉంటారు. కానీ ఆమె మాత్రం.. కుమారుడి కన్నా కుమార్తెకే ప్రాధాన్యం ఇస్తున్నందు వల్ల ఇక చురుగ్గా.. తెలంగాణలోనే రాజకీయం చేయాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. షర్మిల రాజకీయ పార్టీతో సంబంధం లేదని చెబుతున్న వైసీపీ పెద్దలకు ఈ పరిణామం ఇబ్బందికరంగా మారింది. షర్మిల పార్టీ పెట్టడం జగన్‌కు ఇష్టం లేదని.. వద్దని చెప్పారని కూడా సజ్జల చెప్పుకొచ్చారు. కానీ.. ఇప్పుడు గౌరవాధ్యక్షురాలే.. ఆ పార్టీకి మెంటార్‌గా వ్యవహరిస్తున్నట్లుగా ఉండటంతో సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది.

షర్మిల పార్టీతో సంబంధం లేదని చెప్పుకోవాలంటే ఇప్పుడు వైఎస్ విజయలక్ష్మిని గౌరవ అధ్యక్షురాలి హోదా నుంచి తొలగించాల్సి ఉంటుంది. అలా తొలగిస్తే.. జగన్‌పై బ్యాడ్ ఇమేజ్ వస్తుంది. ఒక వేళ తొలగించకపోతే.., డబుల్ గేమ్ ఆడుతున్నారన్న అనుమానం బలపడుతుంది. వైసీపీ పెట్టినప్పటి నుండి .. గౌరవాధ్యక్షురాలిగా ఉన్న విజయలక్ష్మి ఇప్పుడు ఆ పార్టీకే ఇబ్బందికరమైన పనులు చేస్తున్నారు. మరి అధ్యక్షుడు జగన్ రెడ్డి ఏం చేస్తారో మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close