అప్పుడే సెకండ్ వేవ్‌ కట్టడిలో ఏపీ నెంబర్ వన్నట.. !

కరోనా రెండో దశపై ఇంకా పోరాటమే ప్రారంభమే కాదు… తాము గెలిచేశామని ఏపీ మంత్రులు డబ్బా పట్టుకుని కొట్టుకోవడం ప్రారంభించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. కర్నూలులో వైరస్‌ అంశంపై సమీక్షా సమావేశం పెట్టి… ఎప్పుడూ ఇచ్చే ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో కరోనా కట్టడిలో ఏపీ ముందంజలో ఉందని ప్రకటించుకున్నారు. ఏపీ ఏ విధంగా ముందంజలో ఉందో కానీ.. మంత్రి మాత్రం.. తాము గొప్పగా పని చేశామని చెప్పుకోవడానికి ప్రాదాన్యం ఇచ్చారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్… విజృంభిస్తోంది. రోజువారీ కేసులు మూడు లక్షలు దాటిపోయాయి. ఏపీలో ఈ కేసుల సంఖ్య రోజుకు పదివేల వరకూ ఉంది.

ఉన్న పదమూడు జిల్లాల్లో ఐదు జిల్లాల్లో పాజిటివిటీ రేటు యాభై శాతం ఉందని.. స్వయంగా మంత్రి గౌతం రెడ్డి ప్రకటించారు. అంటే పరిస్థితి డేంజర్ స్టేజ్‌ను కూడా దాటిపోయిందన్నమాట. అయినప్పటికీ.. దేశమంతా తమ వైపు చూసేలా.. కరోనాను కట్టడి చేస్తున్నామని మంత్రి బుగ్గన చెప్పుకోవడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. గతంలోనూ కరోనా కట్టడి కన్నా.. కట్టడి చేశామని పబ్లిసిటీ చేసుకోవడానికే ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందని… అందుకే చివరికి తెలంగాణ కన్నా ఎక్కువ మరణాలు. .ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కూడా అదే నిర్లక్ష్యం కనిపిస్తోంది.

పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నప్పటికీ.. కనీస పాటి ఆంక్షలు కూడా పెట్టలేదు. వ్యాక్సిన్ విషయంలోనూ వెనుకబడే ఉన్నారు. అయినా సరే కట్టడిలో దేశంలో ముందంజలో ఉన్నామని చెప్పుకుంటున్నారు. మ్యాచ్ ప్రారంభం కాక ముందే గెలిచేశామని గప్పాలు కొట్టుకోవడం అంటే ఏమిటో ఏపీ మంత్రులు నిరూపిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close