మ‌ళ్లీ ప‌వ‌న్ – అలీ కాంబో

రాఘ‌వేంద్ర‌రావు సినిమాలో ప‌ళ్లూ, పూలూ క‌నిపించ‌డం ఎంత కామ‌నో. ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలో అలీ క‌నిపించ‌డం కూడా అంతే కామ‌న్‌. తొలి ప్రేమ ద‌గ్గ‌ర్నుంచి కాట‌మ‌రాయుడు వ‌ర‌కూ.. వీళ్ల కాంబినేష‌న్ బాగా వ‌ర్కవుట్ అయ్యింది. `అలీ లేక‌పోతే నేను సినిమా చేయ‌లేను` అని ప‌వ‌నే స్వ‌యంగా అన్నాడంటే… వీరిద్ద‌రి కెమిస్ట్రీ ఎంత బాగా క్లిక్క‌య్యిందో అర్థం చేసుకోవొచ్చు. ఈ ప్ర‌యాణంలోనే ఇద్ద‌రూ ఫ్రెండ్స‌యిపోయారు.

అయితే.. ఈమ‌ధ్య ఇద్ద‌రికీ కాస్త గ్యాప్ వ‌చ్చింది. జ‌న‌సేన – వైకాపా పార్టీలు సృష్టించిన గ్యాప్ అది. దాంతో… ఇద్ద‌రూ చెరో మాటా అనుకున్నారు. దాంతో… మైత్రీ బంధం పై కూడా నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. అయితే.. అవ‌న్నీ మెల్ల‌మెల్ల‌గా తేలిపోతున్నాయి. ఈమ‌ధ్య ప‌వ‌న్ గురించి పాజిటీవ్ గానే స్పందిస్తున్నాడు అలీ. త‌మ మ‌ధ్య బంధం అలానే ఉంద‌ని చెబుతూ వ‌చ్చాడు. ఇప్పుడు ప‌వ‌న్ సినిమాలో అలీకి ఓ పాత్ర ద‌క్కింద‌ని టాక్‌. ప‌వ‌న్ ఈమ‌ధ్య వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు. ఓ సినిమాలో అలీకి ఓ మంచి పాత్ర ప‌డింద‌ట‌. ఆ పాత్ర అలీ చేస్తేనే బాగుంటుంద‌ని ప‌వ‌న్ ద‌ర్శ‌కుడికి స‌ల‌హా ఇచ్చిన‌ట్టు. దాంతో అలీ ఖ‌రారైన‌ట్టు ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. సో.. మ‌ళ్లీ వెండి తెర‌పై వీరిద్ద‌రి మైత్రీనీ చూడొచ్చ‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘గీతా’లో మరో సంతకం

'బొమ్మరిల్లు’ సినిమా దర్శకుడు భాస్కర్ జాతకాన్ని మార్చేసింది. ఆ సినిమానే ఆయన ఇంటిపేరు అయింది. రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోలతో సినిమా చేసే ఛాన్స్ త్వరగానే వచ్చేసింది. అయితే...

విష్ణు నిర్ణ‌యం బాగుంది.. కానీ!?

`మా` అధ్య‌క్షుడిగా ఇటీవ‌లే ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు మంచు విష్ణు. వీలైనంత త్వ‌ర‌గా త‌న మార్క్ ని చూపించాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. `మా` బై లాస్ లో కొన్నింటికి మార్చాల‌న్న‌ది విష్ణు ఆలోచ‌న‌. ...

ఏపీ చీకట్లే తెలంగాణ వెలుగులకు సాక్ష్యాలన్న కేసీఆర్

టీఆర్ఎస్ అధినేతగా 9వసారి ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్ తన ప్రసంగంలో .. తెలంగాణ అభివృద్ధిని.. ఏపీతో పోల్చి విడిపోవడం వల్ల ఎంత ప్రగతి సాధించామో వివరించారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీకట్లోకి...

పూరి గ‌ట్స్‌.. రెండ్రోజుల ముందే ప్రీమియ‌ర్‌

సినిమాకి టాక్ చాలా ముఖ్యం. పాజిటీవ్ టాక్ వ‌స్తే - క‌ల‌క్ష‌న్లు వ‌స్తాయి. ఏమాత్రం తేడా వ‌చ్చినా - ఫ‌ట్‌మ‌న‌డం ఖాయం. రిలీజ్ డే టాక్ అనేది వ‌సూళ్ల‌లో కీల‌క పాత్ర పోషిస్తుంటుంది....

HOT NEWS

[X] Close
[X] Close