అప్పుడే సెకండ్ వేవ్‌ కట్టడిలో ఏపీ నెంబర్ వన్నట.. !

కరోనా రెండో దశపై ఇంకా పోరాటమే ప్రారంభమే కాదు… తాము గెలిచేశామని ఏపీ మంత్రులు డబ్బా పట్టుకుని కొట్టుకోవడం ప్రారంభించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. కర్నూలులో వైరస్‌ అంశంపై సమీక్షా సమావేశం పెట్టి… ఎప్పుడూ ఇచ్చే ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో కరోనా కట్టడిలో ఏపీ ముందంజలో ఉందని ప్రకటించుకున్నారు. ఏపీ ఏ విధంగా ముందంజలో ఉందో కానీ.. మంత్రి మాత్రం.. తాము గొప్పగా పని చేశామని చెప్పుకోవడానికి ప్రాదాన్యం ఇచ్చారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్… విజృంభిస్తోంది. రోజువారీ కేసులు మూడు లక్షలు దాటిపోయాయి. ఏపీలో ఈ కేసుల సంఖ్య రోజుకు పదివేల వరకూ ఉంది.

ఉన్న పదమూడు జిల్లాల్లో ఐదు జిల్లాల్లో పాజిటివిటీ రేటు యాభై శాతం ఉందని.. స్వయంగా మంత్రి గౌతం రెడ్డి ప్రకటించారు. అంటే పరిస్థితి డేంజర్ స్టేజ్‌ను కూడా దాటిపోయిందన్నమాట. అయినప్పటికీ.. దేశమంతా తమ వైపు చూసేలా.. కరోనాను కట్టడి చేస్తున్నామని మంత్రి బుగ్గన చెప్పుకోవడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. గతంలోనూ కరోనా కట్టడి కన్నా.. కట్టడి చేశామని పబ్లిసిటీ చేసుకోవడానికే ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందని… అందుకే చివరికి తెలంగాణ కన్నా ఎక్కువ మరణాలు. .ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కూడా అదే నిర్లక్ష్యం కనిపిస్తోంది.

పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నప్పటికీ.. కనీస పాటి ఆంక్షలు కూడా పెట్టలేదు. వ్యాక్సిన్ విషయంలోనూ వెనుకబడే ఉన్నారు. అయినా సరే కట్టడిలో దేశంలో ముందంజలో ఉన్నామని చెప్పుకుంటున్నారు. మ్యాచ్ ప్రారంభం కాక ముందే గెలిచేశామని గప్పాలు కొట్టుకోవడం అంటే ఏమిటో ఏపీ మంత్రులు నిరూపిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్యాక్ట్ చెక్ ఏపీ.. నిజాలు చెప్పలేక తంటాలు !

ఏపీ పోలీసులు ఫ్యాక్ట్ చెక్ చేస్తామంటూ ప్రత్యేకంగా ఫ్యాక్ట్ చెక్ ఏపీ అంటూ కొత్త విభాగాన్ని చాలా కాలం కిందట ప్రారంభించారు. ఇందులో సామాన్యులు తప్పుడు సమాచారం వల్ల నష్టపోయే...

కొత్త పార్టీ..కొత్త విమానం.. కొత్త హుషారు.. కేసీఆర్ స్టైలే వేరు !

కేసీఆర్ మౌనం వెనుక ఓ సునామీ ఉంటుంది. జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనుకున్న తర్వాత కసరత్తు కోసం ఆయన కొంత కాలం మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన సునామీలా విరుచుకుపడనున్నారు. దసరా రోజు...

ఎడిటర్స్ కామెంట్స్ : రాజకీయాలకు శాపం స్ట్రాటజిస్టులు !

కడివెడు పాలను చెడగొట్టడానికి..విషపూరితం చేయడానికి చుక్క విషం చాలన్నట్లుగా ... వందల పార్టీలు.. వేల మంది నాయకులతో విస్తరించిన రాజకీయాన్ని ఒకే ఒక్క స్ట్రాటజిస్ట్ విషపూరితం చేశారు. రాజకీయాలంటే...

వైజాగ్‌లో సీఎం క్యాంపాఫీస్ కడితే తప్పేంటి : బొత్స

తప్పేంటి ? అనేది మంత్రి బొత్స ఊతపదమో.. లేకపోతే ఎదురుదాడో తెలియదు కానీ అసువుగా వాడేస్తారు. తాజాగా విశాఖలోసీఎం క్యాంపాఫీస్ నిర్మిస్తే తప్పేమిటని అసువుగా జర్నలిస్టుల్ని ఎదురు ప్రశ్నించేశారు. అయితే ఇప్పటి వరకూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close