ద‌ర్శ‌కుడి నోటి దుర‌ద‌… దూర‌మ‌వుతున్న టీమ్‌

అత‌నో టాలీవుడ్ లో పేరు మోసిన దర్శ‌కుడు. మాస్ సినిమాల్ని బాగా తీస్తాడ‌ని పేరు. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో త‌న‌దైన మార్క్ వుంది. త‌న ఖాతాలో సూప‌ర్ హిట్లున్నాయి. అయితే.. కాస్త నోటి దుర‌ద‌. దాంతోనే చాలామందికి దూరం అవుతున్నాడు. త‌న తొలి సినిమా నుంచీ.. త‌న తో పాటు ప‌ని చేస్తున్న ఫైట్ మాస్ట‌ర్‌ని త‌క్కువ చేసి మాట్లాడ‌డం వ‌ల్ల‌.. త‌న తాజా సినిమా నుంచి అర్థాంత‌రంగా వెళ్లిపోయాడాయ‌. `టైటిల్స్ లో వాళ్ల పేర్లు ప‌డుతున్నాయంతే.. అంతా చేయించేది నేనే` అన్న‌ట్టు మాట్లాడ‌డంతో ఆ ఫైట్ మాస్ట‌ర్స్ హ‌ర్ట‌య్యారు. వంద‌ల సినిమాలు చేసి, త‌మ‌దంటూ ఓ బ్రాండ్ సంపాదించిన ఫైట్ మాస్ట‌ర్స్ గురించి ఎవ‌రైనా ఇలా మాట్లాడ‌తారా? అందుకే టీమ్ నుంచి వాళ్లు వెళ్లిపోయారు.

ఇప్పుడు అదే టీమ్ నుంచి కొంత‌మంది రైట‌ర్లు, అసిస్టెంట్లు, అసోసియేట్లు కూడా దూరం అయ్యార‌ని తెలుస్తోంది. త‌మ‌కు రావాల్సిన క్రిడెట్ ఆ ద‌ర్శ‌కుడు ఇవ్వ‌డం లేద‌ని, పైగా… అంద‌రి ముందూ బూతులు తిడుతున్నాడ‌న్న‌ది వాళ్ల ఆరోప‌ణ‌.అయినా ఆ డైరెక్ట‌ర్ ఇవేం ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌. `మీరు పోతే వంద మంది` అంటూ… వెళ్తున్న వాళ్ల‌ని వెళ్తున్న‌ట్టే సాగ‌నంపుతున్నాడ‌ట‌. ఇంత‌కు ముందు కూడా ఈ స్థానంలో ప‌నిచేసిన ఓ రైట‌ర్ ఇలానే అలిగి వెళ్లిపోయాడు. మ‌రో రైట‌ర్‌… త‌న పై కోపంతోనే ద‌ర్శ‌కుడిగా మారాడు. ప్ర‌తిభ ఎవ‌రికైనా ఉండొచ్చు. అక్క‌డే విన‌యం కూడా ఉండాలి. అప్పుడే ప్ర‌తిభ మ‌రింత ప్ర‌కాశిస్తుంది. ఈ విష‌యం ఆ ద‌ర్శ‌కుడు ఎప్పుడు తెలుసుకుంటాడో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

గుంటూరు కారం: త్రీడీలో క‌నిపించిన బీడీ

https://www.youtube.com/watch?v=V-n_w4t9eEU&feature=youtu.be ముందు నుంచీ అనుకొంటున్న‌ట్టే.. మ‌హేష్ బాబు - త్రివిక్ర‌మ్ సినిమాకి 'గుంటూరు కారం' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సూప‌ర్ స్టార్ కృష్ణ జ‌యంతి సంద‌ర్భంగా ఈ రోజు ఫ‌స్ట్ గ్లిమ్స్ విడుద‌ల...

కేశినేనికి దారి తెలీడం లేదా ?

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని తనను తాను ఓ రేంజ్ లో ఊహించుకుంటున్నారు. బెజవాడను తిరుగులేని విధంగా అభివృద్ధి చేశానని.. టాటా ట్రస్ట్ అంటే తనదేనన్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఇండిపెండెంట్ గా...

‘గుహ’ క‌డుతున్న ప్ర‌భాస్‌

డ్రీమ్ హౌస్‌.. అంటూ ప్ర‌తీ ఒక్క‌రికీ ఉంటుంది. త‌మ ఇల్లు ఎలా ఉండాలో.. ముందు నుంచీ క‌ల‌లు కంటుంటారు. అలాంటి క‌ల ప్ర‌భాస్‌కీ ఉంది. అత్యాధునిక హంగుల‌తో ఓ ఫామ్ హౌస్ నిర్మించుకోవాల‌ని...

తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు కేంద్రం కూడా రెడీ !

తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ఎవరూ ఊహించని విధంగా .. అత్యంత కాస్ట్ లీగా నిర్వహించడానికి తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేసింది. మరోసారి మన తెలంగాణ .. అనే సెంటిమెంట్ అందరిలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close