ఓ సారి అరెస్టయితే పోలా..!?

ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ అనగానే.. ప్రజల్లో పెద్దగా స్పందన కనిపించలేదు. రాత్రికి రాత్రే వందల మంది పోలీసులు ఇంటిని చుట్టుముట్టారని తెలియగానే.. అందులో వింతేముందన్న అభిప్రాయం వినిపించింది. ప్రభుత్వం ఏదో ఓ తప్పుడుకేసు పెట్టి.. ఎప్పుడో ఓ సారి అరెస్ట్ చేస్తుందని… టీడీపీ నేతలు కూడా… మానసికంగా అరెస్టులుకు సిద్ధమయ్యారు. ఏదైనా టాపిక్‌ను డైవర్ట్ చేయాలనుకున్నప్పుడో… మరో ఏదైనా సమస్యను చిన్నది చేయాలనుకున్నప్పుడో… ప్రభుత్వం టీడీపీ నేతల అరెస్టు వ్యూహాలను అనుసరిస్తోందని నమ్ముతున్నారు. అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసినప్పుడు… ఆ ఎఫెక్ట్ కనిపించింది. అచ్చెన్నాయుడు అంశం హాట్ టాపిక్ అయింది. తర్వాత టీడీపీ నేతల అరెస్టులు కామన్‌గా మారిపోయాయి.

టీడీపీ నేతల్ని అరెస్ట్ చేస్తున్నారు కానీ… వారు అక్రమాలు చేశారనేలా… ఆధారాలను ప్రజల ముందు ఉంచలేకపోతున్నారు. కోర్టుల సంగతేమో కానీ.. రాజకీయనేతల్ని అరెస్టులు చేసినప్పుడు… వారిని రాజకీయ కక్షతో కాదు.. నిజంగానే నేరం చేసినందుకు అరెస్ట్ చేస్తున్నామని ప్రజల్ని నమ్మించగలగాలి. లేకపోతే అది రాజకీయ కక్ష సాధింపుల అరెస్టులు అనుకుంటారు. ఇప్పుడు. .. టీడీపీ నేతల వరుస అరెస్టుల విషయంలో అదే జరుగుతోంది. రాజకీయం కోసం అరెస్టులు చేస్తున్నారు తప్ప… అక్రమాలు.. అవకవతకల ఆధారాలతో కాదని ప్రజలు కూడా నమ్మే పరిస్థితి వచ్చింది. అందుకే టీడీపీ నేతలు కూడా.. నెక్ట్స్ తమను అరెస్ట్ చేస్తే బాగుండు అని అనుకునే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నామని చెప్పుకునేందుకు ఓ అవకాశం వస్తుందని భావిస్తున్నారు.

మొన్న అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నిన్న దేవినేని ఉమా, నేడు ధూళిపాళ్ల నరేంద్ర, రేపు మరో కీలక నేత… ఇలా ఒకరి వెంట మరొకరు తెలుగుదేశం నేతలను ప్రభుత్వం అరెస్టు చేస్తుంది… తెలుగుదేశం పార్టీలో నోరున్న, స్వరం గట్టిగా వినిపిస్తూ ప్రభుత్వం పై విరుచుకుపడుతున్న నేతల అరెస్ట్‌లు వ్యూహం ప్రకారమే జరుగుతున్నాయని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. మరికొంతమంది టీడీపీ కీలక నేతల పై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిందని టీడీపీలో ఇప్పటికే ప్రచారం ఉంది. తమను అరెస్ట్ చేస్తే.. ఎలాంటి వ్యూహాలు అవలంభించాలో.. ప్రజల్లో జగన్ వేధిస్తున్నారన్న భావన తీసుకు రావడానికి ఏం చేయాలో ఇప్పటికే స్కెచ్ రెడీ చేసుకున్నారని అంటున్నారు. మొత్తానికి టీడీపీ నేతలు.. ఓ సారి అరెస్టయితేనే బెటర్ అన్న ఫీలింగ్‌కు వస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close