మీడియా వాచ్ : కరోనాకు బలవుతున్న జర్నలిస్టులు..!

కరోనా మహమ్మారి ఎంత దారుణంగా విస్తరిస్తోదంటే.. ఏ ఒక్కరిని కదిలించినా.. ఆత్మీయులను.. బంధువును కోల్పోయామన్న మాటలే వినిపిస్తున్నాయి. సమాచారం సేకరించే జర్నలిస్టుల్లోనూ అదే మాట వినిపిస్తోంది. కారణం విస్తృతం అయ్యాక.. తెలుగు రాష్ట్రాల్లోని పదిహేను మంది జర్నలిస్టులు తమ ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో స్ట్రింగర్లు మాత్రమే కాదు… జిల్లా స్థాయి రిపోర్టర్లు .. డెస్క్‌లో పని చేసేవాళ్లు కూడా ఉన్నారు. సాక్షి ఉద్యోగులు ఇద్దరు చనిపోయిన వారిలో ఉన్నారు. సాక్షి కడప జిల్లా స్టాఫర్ తో పాటు… డెస్క్‌లో పని చేసే రామచంద్రరావు అనే సబ్ ఎడిటర్ కూడా కరోనా కారణంగా చనిపోయారు.

కరోనా కారణంగా చనిపోయిన వారిలో సీనియర్ జర్నలిస్ట్ అమర్‌నాథ్ కూడా ఉన్నారు. జర్నలిస్టు ఉద్యమంలో కీలకంగా పని చేసిన ఆయన…కరోనాతో పది రోజుల పాటు పోరాడి నిమ్స్‌లో చనిపోయారు. బతుకమ్మ టీవీ సీఈవో, శ్రీకాకుళం ఎన్టీవీ రిపోర్టర్ చంద్రశేఖర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా పదిహేను మంది జర్నలిస్టులు మూడు, నాలుగు రోజుల్లోనే ప్రాణాలు కోల్పోయారు. కరోనా పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో.. తెలియచెప్పే లెక్క ఇది.

జర్నలిస్టుల కోసం సంఘాల్లో అత్యున్నత స్థాయిలో పనిచేసిన అమర్‌నాథ్ చనిపోతేనే.. పెద్దగా ఎవరూ పట్టిచుకోలేదు. ఇతర జర్నలిస్టుల గురించి ఎవరు పట్టించుకుంటారు. కొన్ని కొన్ని టీవీ చానళ్ల యాజమాన్యాలు మాత్రం… జిల్లా స్థాయి రిపోర్టర్లు చనిపోతే కొంత అండగా ఉంటున్నాయి. ఆ కుటుంబాలకు కాస్తో కూస్తో సాయం చేస్తున్నాయి. కానీ ఇతరులు చనిపోతే పట్టించుకునేవారు కూడా లేరు. ప్రభుత్వాలు అసలు పట్టించుకోవడం మానేశాయి. బతికి ఉండి.. పత్రిక కోసం పని చేస్తున్నప్పుడు మాత్రమే వారి అవసరం నేతలకు ఉంది. చనిపోయిన తర్వాత వారి గురించి పట్టించుకునే తీరిక కూడా నేతలకు లేదు. దీంతో జర్నలిస్టులు.. అంపశయ్యమీద ఉన్నట్లు అయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close