ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్ స్టాప్ పెట్టేసిన వేళ‌.. ఈ వారం రెండు సినిమాలు బాక్సాఫీసు ముందుకు వ‌స్తున్నాయి. ఆ ఒక్క‌టీ అడ‌క్కు, ప్ర‌స‌న్న‌వ‌ద‌నం ప్రేక్ష‌కుల్ని ప‌క‌ల‌రించ‌బోతున్నాయి. నెల రోజులుగా వెండి తెర‌పై స‌రైన బొమ్మ ప‌డ‌లేదు. ఎన్నిక‌లు అయ్యేంత వ‌ర‌కూ బాక్సాఫీసు ద‌గ్గ‌ర సంద‌డే క‌నిపించ‌ద‌ని అంతా ఫిక్స‌యిపోయారు. సినిమా వ‌చ్చినా, మౌత్ టాక్ ఉంటేనే జ‌నం వెళ్తున్నారు. ఈ ద‌శ‌లో.. ఈ రెండు సినిమాల ప‌రిస్థితి ఏమిటి? రాంగ్ టైమింగ్ లో వ‌స్తున్నాయా? అనేది ప్ర‌ధాన‌మైన ప్ర‌శ్న‌.

న‌రేష్ చాలారోజుల త‌ర‌వాత త‌న‌దైన కామెడీ టైమింగ్ తో చేసిన సినిమా ‘ఆ ఒక్క‌టీ అడ‌క్కు’ ఈవీవీ సూప‌ర్ హిట్ సినిమాల టైటిల్‌ని వాడుకోవ‌డం న‌రేష్‌కు ఇదే తొలిసారి. టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఆక‌ట్టుకొన్నాయి. క‌చ్చితంగా సినిమాలో ఏదో మంచి పాయింట్ ఉంద‌న్న సంగ‌తి అర్థం అవుతోంది. `ఓం భీమ్ బుష్`తో కామెడీ సినిమాల‌కు రోజులు చెల్లిపోలేదన్న విష‌యం తేట‌తెల్ల‌మైంది. న‌రేష్ ది కామెడీ మార్క్‌. ఆయ‌న న‌వ్విస్తే సినిమా హిట్టే. మ‌రి `ఆ ఒక్క‌టీ అడ‌క్కు`కు ఎలాంటి రిజ‌ల్ట్ ఇస్తారో చూడాలి.

వెరైటీ క‌థ‌ల్ని ఎంచుకొంటూ కెరీర్‌ని ముందుకు తీసుకెళ్తున్నాడు సుహాస్‌. ఇటీవ‌లే `అంబాజీపేట మ్యారేజీ బ్యాండు`తో ఆక‌ట్టుకొన్నాడు. ఇప్పుడు `ప్ర‌స‌న్న‌వ‌ద‌నం` వ‌స్తోంది. ఓ సీరియ‌స్ పాయింట్ ని ప‌ట్టుకొని, అందులో డ్రామా, స‌స్పెన్స్ మిక్స్ చేశారు. ప్ర‌మోష‌న్లు కూడా జోరుగానే సాగుతున్నాయి. సుహాస్ ట్రాక్ రికార్డ్ వ‌ల్ల బీ,సీ సెంటర్ల‌లో ఈ సినిమాకు టికెట్లు తెగే అవ‌కాశం ఉంది. కాక‌పోతే.. టైమింగే చాలా ముఖ్యం. ఎన్నిక‌ల వేడిలో ఈ సినిమాల్ని జ‌నం ప‌ట్టించుకొంటారా? అనేది తేలాల్సివుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రంగంలోకి కేజ్రీవాల్… బీజేపీ ఆశలపై నీళ్లు చల్లుతారా..?

మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఇటీవల మధ్యంతర బెయిల్ రావడంతో ఎన్నికల్లో ఆయన ప్రభావం ఎంతమేర ఉంటుందనేది చర్చనీయాంశం అవుతోంది. గతంలో ఢిల్లీలోని లోక్ సభ...

టాలీవుడ్ కి తొలి ప్రమాద హెచ్చరిక

తెలంగాణలో రెండు వారాల పాటు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో షోలు ఆపివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో నష్టం ఎక్కువ వస్తోందని, దీంతో సినిమాల ప్రదర్శనలు ఆపాలని నిర్ణయించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు....

ఏపీలో కల్లోల పరిస్థితి…అందుకే జగన్ కాముష్..?

ఓడిపోతున్నట్లు నిర్ధారణకు వచ్చారో లేదంటే, తన్నుకొని చావండి అనుకున్నారో ఏమో కాని, ఏపీలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పల్నాడులో టీడీపీ - వైసీపీ...
video

టీజర్ రివ్యూ : ఇస్మార్ట్ డబుల్ మాస్

https://youtu.be/tq2HmozH_5Y?si=7YJ-IcGKWvYsaRDj రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్‌ సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్'తో అలరించబోతున్నారు. రామ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ విడుదల చేశారు. ల్యాబ్‌లో ఉన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close