నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు… ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర వేయాల‌ని చూసి ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ప్ర‌స్తుతానికి ఖాళీనే. అందుకే.. ఊసుపోక ఓ యూ ట్యూబ్ ఇంట‌ర్వ్యూ ఇచ్చి ఇరుక్కున్నాడు. ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డం త‌ప్పు కాదు, కానీ అంద‌రి దృష్టీ త‌న‌పై ప‌డాల‌నో, ఫోక‌స్ ఉండాల‌నో, మ‌ళ్లీ ఏదోలా ఫేమ‌స్‌ అవ్వాల‌నో… నోటికొచ్చిన‌ట్టు మాట్లాడ‌డం త‌ప్పు. అలాంటి త‌ప్పు ఓ సీనియ‌ర్ ర‌చ‌యిత చేయ‌డం ఇంకా పెద్ద త‌ప్పు.

ఇంట‌ర్వ్యూలో చాలా విష‌యాలు ప్ర‌స్తావించారు తోట ప‌ల్లి మ‌ధు. అందులో స‌గం వ‌ర‌కూ దిగ్గ‌జ న‌టీన‌టుల్ని, ద‌ర్శ‌కుల్ని, నిర్మాత‌ల్ని కించ‌ప‌రిచే, వాళ్ల ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగించి, వాళ్ల క్యారెక్ట‌ర్ల‌ని త‌గ్గించే విష‌యాలే ఎక్కువ వినిపించాయి. జంధ్యాల‌, సావిత్రి, కోడిరామ‌కృష్ణ‌, శ్రీ‌దేవి, కోదండ‌రామిరెడ్డి ఇలా ఒక‌రా ఇద్ద‌రా… చాలామంది దిగ్గ‌జాల గురించి, వాళ్ల వ్య‌క్తిగ‌త జీవితాల గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శ్రీ‌దేవి చనిపోయిన రోజు ఏం జ‌రిగింది? ఎవ‌రెవ‌రు తాగుడుకు బానిస అయ్యారు? ఎవ‌రి వ‌ల్ల ఎవ‌రి జీవితాలు నాశ‌నం అయ్యాయి? అనే విష‌యాల్ని ఆయ‌నేదో ప‌క్క‌నుండి చూసిన‌ట్టే పూస గుచ్చి వివ‌రించారు. ముర‌ళీమోహ‌న్‌పైనా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. అస‌లు ఆయ‌న న‌టుడే కాద‌న్న‌ట్టు… ఏవేవో మాట్లాడారు. ఇప్పుడు ఈ ఇంట‌ర్వ్యూ ఇండ‌స్ట్రీలో కాక రేపుతోంది. ఇలాంటి ఎగ‌స్ట్రా విన్యాసాలు ఆప‌క‌పోతే.. మీ గురించి మేం స్పందించాల్సి ఉంటుందంటూ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు, ర‌చ‌యిత దేవి ప్ర‌సాద్ నేరుగా సోష‌ల్ మీడియా ద్వారానే స్పందించ‌డం విశేషం. కోడిరామ‌కృష్ణ‌, కోదండ‌రామిరెడ్డి శిష్యులు ఇండ‌స్ట్రీలో చాలామంది ఉన్నారు. వాళ్లు ఇప్పుడు తోట‌ప‌ల్లి మ‌ధుని టార్గెట్ చేస్తున్నారు. ఆయ‌నపై చిత్ర‌సీమ పెద్ద‌ల‌కు ఫిర్యాదు చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నారు. మ‌న‌మ‌ధ్య లేనివాళ్ల గురించి, చెడుగా మాట్లాడ‌డం స‌భ్య‌త కాదు. ఈ విష‌యం ఇంత పెద్ద ర‌చ‌యిత‌కు అర్థం కాక‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close