కరోనా పాజిటివ్‌గా తేలి హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్‌లు ఆస్పత్రిలో చేరినట్లుగా తెలుస్తోంది. మొదట పెద్దగా లక్షణాలు లేని స్థితిలో … పాజిటివ్‌గా తేలినప్పటికీ.. తర్వాత సింప్టమ్స్ పెరగడం… ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో.. వారిని వైద్యులు ఆస్పత్రికి రిఫర్ చేసినట్లుగా భావిస్తున్నారు. ఎంపీ సంతోష్.. నిన్నామొన్నటి వరకూ కేసీఆర్‌తో పాటు ఫాంహౌస్‌లోనే ఉన్నారు. కేటీఆర్. కూడా అక్కడే వైద్యుల పర్యవేక్షణలో అక్కడే ఉన్నప్పటికీ.. పరిస్థితి కాస్తంత ఇబ్బందికరంగా మారింది. మరో వైపు కేసీఆర్‌కు ఎలాంటి లక్షణాలు లేవని వైద్యులు చెబుతున్నారు.
అయితే.. ఆర్టీపీసీఆర్ టెస్టులో మిశ్రమ ఫలితాలు రావడంతో ఆయన అసోలేషన్లోనే ఉన్నారు. రెండు, మూడు రోజుల్లోనే టెస్టులు నిర్వహించే అవకాశం ఉంది. కరోనా వైరస్ తగ్గితే తగ్గుతుంది.. లేకపోతే.. బాడీలో బలహీనంగా ఉన్న వ్యవస్థపై దాడి చేసి.. ఆరోగ్యపరిస్థితిని దిగజార్చుతోంది. అందుకే వైద్యులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో… వ్యక్తిగత వైద్యులు.. సంతోష్, కేటీఆర్‌లను ముందు జాగ్రత్తగా ఆస్పత్రికి రిఫర్ చేసినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణలో పలువురు రాజకీయ నేతలు కరోనా బారిన పడ్డారు. మోత్కుపల్లి నర్సింహులు పరిస్థితి సీరియస్ అయింది. అయితే ఆయన కోలుకున్నారు. డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లారు. మరికొంత మంది మంత్రులు కూడా కరోనా బారిన పడ్డారు. అందరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని చెబుతున్నారు. కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అధికార పార్టీ నేతలు.. తమ క్యాడర్‌కు అదే పనిగా సూచిస్తున్నారు.