సినీస్టార్స్ సాయం.. మ‌ళ్లీ కావాలి!

ఎప్పుడు ఎలాంటి క‌ష్టం వ‌చ్చినా.. ముందుండి విరాళాలు ప్ర‌క‌టించేది.. సినిమా వాళ్లే. తుఫాన్లు, వ‌ర‌ద‌లూ వ‌చ్చినప్పుడు ఆదుకోవ‌డానికి ముంద‌డుగు వేసేదీ వాళ్లే. క‌రోనా ఫ‌స్ట్ వేవ్.. కుదిపేస్తున్న‌ప్పుడు టాలీవుడ్ స్టార్లు జోరుగా విరాళాలు ఇచ్చారు. రెండు తెలుగు ప్ర‌భుత్వాల‌తో పాటు, కేంద్రానికీ… త‌మ వంతు సాయం అందించారు. ఇప్పుడు మ‌రోసారి… వాళ్ల ఆప‌న్న‌హ‌స్తం అందించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది.క‌రోనా సెకండ్ వేవ్ రోజు రోజుకి మ‌రింత ఉధృతంగా మారుతోంది. ప‌రిస్థితులు చేదాటి పోతున్నాయి. ఆక్సిజ‌న్ అంద‌క‌, ఆసుప‌త్రిలో ప‌డ‌క‌లు లేక‌.. చాలామంది అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. స‌రైన స‌మ‌యంలో వైద్యం అందిస్తే నిల‌బ‌డే ప్రాణాలు కాస్తా.. గాలిలో దీపాలుగా మారిపోయాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో… చిత్ర‌సీమ ముందుకు రావాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది.

త‌మిళ‌నాట‌.. విజ‌య్ ముందుకొచ్చి.. ఆక్సిజ‌న్ సిలండ‌ర్ల‌కు ప్ర‌భుత్వాసుప‌త్రుల‌కు స‌ర‌ఫ‌రా చేసేలా ఏర్పాటు చేశాడు. ఇంకొంత‌మంది హీరోలూ అదే దారిన న‌డుస్తున్నారు. టాలీవుడ్లోనూ హీరోలు ఇలానే చొర‌వ చూపిస్తే బాగుంటుంది. నిజానికి ఇప్పుడే వాళ్ల అవ‌స‌రం ఎక్కువ‌. ఎందుకంటే.. ఆక్సిజ‌న్ సిలండ‌ర్ల లోటు చాలా చోట్ల క‌నిపిస్తోంది. చాలా ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌లో అర‌కొర సౌకర్యాలే ఉన్నాయి. త‌మ వంతు సాయంగా… ఆక్సిజ‌న్ సిలండ‌ర్లు అందించే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ప్ర‌తీసారీ సినిమావాళ్లే స్పందించాలా? అనేం లేదిప్పుడు. ఎవ‌రు ఎలాంటి సాయం చేసినా… అది చాలామంది జీవితాల్ని నిల‌బెడుతుంది. సినిమా వాళ్లు చేసిన స‌హాయం ఎప్పుడూ ధ‌న రూపంలోనే ఉంటుంది. అయితే ఈసారి మాత్రం ఆక్సిజ‌న్ సిలెండ‌ర్లపై దృష్టి సారిస్తే మంచిది. లేదంటే.. హీరోలు ఇచ్చిన విరాళాల్ని ప్ర‌భుత్వం ఒక నిర్దిష్ట‌మైన ల‌క్ష్యం కోసం కేటాయిస్తే ఇంకా బాగుంటుంది.

గ‌తంలో సీసీసీకి కూడా హీరోలు భారీ విరాళాలు ఇచ్చారు. దాంతో… సినీకార్మికుల‌కు కాస్త స‌హాయం అందింది. అప్పుడు ఇచ్చిన నిధులు కొన్ని మిగిలి ఉండ‌డంతో.. అడ‌పా ద‌డ‌పా వాటినే ఉప‌యోగిస్తూ సాయం చేస్తున్నారు. సినీ కార్మికులకు అవ‌స‌ర‌మైన వాక్సిన్లని ఇప్ప‌టికే సీసీసీ అందిస్తోంది. ఆక్సిజ‌న్ సిలండ‌ర్లూ, భీమా లాంటి స‌దుపాయాలు అందించ‌డానికి సీసీసీ మ‌రోసారి ముందుకు వ‌స్తే బాగుంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మళ్లీ తెలంగాణలో డ్రగ్స్ కేసుల కలకలం !

హైదరాబాద్, సైబరాబాద్‌కు ఇప్పుడు ఉన్న కమిషనర్ల నేరస్తును ఓ ఆట ఆడిస్తున్నారు. సైబరాబాద్ కమిషనర్ సైబర్ ఫ్రాడ్‌ల మీద దృష్టి పెడితే.. హైదరాబాద్ కమిషన్ సీవీ ఆనంద్ డ్రగ్స్ కేసుల్ని వెలికి తీస్తున్నారు....

ఎన్నికల జిమ్మిక్ అనుకున్నా సరే.. ప్రధాని స్టైల్ అదే !

ప్రధానమంత్రి నరేంద్రమోడీ రిపబ్లిక్ డే వేడుకల్లో భిన్నంగా కనిపించారు. భగత్ సింగ్ తరహా టోపీ..  ఓ విభిన్నమైన కండువాతో వేడుకల్లో పాల్గొన్నారు. టోపీపై బ్రహ్మకమలం ముద్ర ఉంది. కాసేపటికే నెటిజన్లు అవి ఎక్కడివో...

అదే నరసింహన్ గవర్నర్ అయితే ఇలా జరిగేదా !?

రిపబ్లిక్ డే రోజున కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానించారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైరయ్యారు. కారణం ఏమిటంటే రాజ్‌భవన్‌లో జరిగే రిపబ్లిక్ డే వేడుక.. జెండా పండుగకు కేసీఆర్ వెళ్లలేదు. కనీసం సీనియర్...

“కొత్త జిల్లాల పని” చేస్తామంటున్న ఉద్యోగ సంఘాలు !

ఉద్యోగులంతా ఉద్యమంలో ఉన్న సమయంలో ప్రజల దృష్టి మరల్చేందుకే కొత్త జిల్లాలంటూ ప్రభుత్వం ప్రకటనలు చేసిందని ఆరోపణలు వస్తున్న సమయంలో ఉద్యోగ సంఘాలు భిన్నంగా స్పందించాయి. ఐఏఎస్‌లు మినహా ఉద్యోగలంతా సమ్మెలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close