అదిగదిగో లాక్‌డౌన్.. తూచ్..!

లాక్‌డౌన్ పేరుతో దేశ ప్రజలతో కొంత మంది ఎమోషనల్ గేమ్ ఆడుతున్నారు. కేంద్రం అధికారికంగా… దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పెట్టే అవకాశం లేదని.. రాష్ట్రాల వారీగా నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే కొంత మంది సోషల్ మీడియా స్వేచ్చను లాక్ డౌన్ పేరుతో ఫేక్ న్యూస్ ప్రసారం చేయడానికి ఉపయోగించుకుంటున్నారు. దీంతో ప్రజల్లో గందరగోళం ఏర్పడుతోంది. మే రెండో తేదీన అంటే.. ఆదివారం ఐదురాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ పూర్తవుతుంది. ఆ తర్వాత రోజే.. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అంటూ కొద్ది రోజుల నుంచి ప్రచారం చేస్తున్నారు. మెజార్టీ జనం నమ్ముతున్నారు.

దీంతో వారు.. రెండు, మూడు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు తెచ్చుకుని ఇంట్లో భద్రపర్చుకుంటున్నారు. అసలు పానడమిక్ కన్నా ఇదే ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ప్రెస్‌ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రత్యేకంగా వివరణ ఇచ్చింది. లాక్ డౌన్‌పై కేంద్రం ఎలాంటి ప్రకటనలు చేయలేదని స్పష్టం చేసింది. అయితే.. అసలు కళ్లతో చూసిన నిజాన్ని కూడా నమ్మలేని రీతిలో.. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలే నిజం అనుకునేలా.. ప్రస్తుతం ప్రజల మైండ్ సెంట్ మారిపోయింది. అందుకే ఎక్కువ మంది లాక్ డౌన్ ఉంటుందనే నమ్ముతున్నారు.

మరో వైపు… అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు ఆంటోనియో ఫౌచీ.. భారరత్‌లో కరోనా కంట్రోల్‌లోకి రావాలంటే.. లాక్ డౌన్ ఒక్కటే మార్గమని మీడియా ద్వారా సందేశం పంపించారు. ఇది కూడా మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తంగా ఆదివారం కౌంట్ డౌన్ అయిపోతుంది. ఆ తర్వాత.. కేంద్రం ఏదైనా నిర్ణయాన్ని ప్రకటిస్తుందా.. లేకపోతే.. రాష్ట్రాలకే్ వదిలేస్తుందా అన్నదానిపై క్లారిటీ వస్తుంది. అప్పటి వరకూ ప్రచారం ఆగదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో మంత్రులు ఫెయిల్..!?

కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ గా ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తిపోస్తున్నా ఒకరిద్దరూ మంత్రులు మినహా మిగతా వారెవరూ పెద్దగా స్పందించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. వీటన్నింటికి రేవంత్ ఒక్కడే కౌంటర్ ఇస్తున్నారు తప్పితే మంత్రివర్గం...

ఇలా అయితే కుదరదు మార్చాల్సిందే…త్వరలో సీఎం రేవంత్ కీలక నిర్ణయం

తెలంగాణ సీఎంవోను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారా..? ఫైల్స్ క్లియరెన్స్ లో అధికారుల నిర్లక్ష్యంపై ఫిర్యాదులు అందటంతో సమర్ధవంతమైన అధికారులను నియమించాలని ఫిక్స్ అయ్యారా..? ఎన్నికల కోడ్ ముగియగానే సీఎంవోలో...

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close