పాత్రికేయుడు, నటుడు టీఎన్నార్ ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. ఆయన కొద్ది రోజుల క్రిందట ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరు కరోనా బారీన పడ్డారు. అలా…. టీఎన్నార్ కీ కరోనా సోకింది. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొంది, కోలుకున్నట్టే అనిపించినా… ఆయన ఆరోగ్యం తిరగబెట్టింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది.
టీఎన్నార్ టాక్ షో.. పేరుతో ఆయన సినీ ప్రముఖులతో ముఖా ముఖి కార్యక్రమం నిర్వహించారు. అది బాగా పాపులర్ అయ్యింది. సుదీర్ఘమైన ఇంటర్వ్యూలతో స్టార్స్ వ్యక్తిగత విషయాల్ని బాగా రాబట్టేవారాయన. సినీ ప్రముఖులతో ఏర్పడిన పరిచయాల వల్ల… నటుడిగానూ మారారు. పలాస లాంటి చిత్రాల్లో కీలకమైన పాత్రలు పోషించారు. ఇప్పుడు నటుడిగా బిజీ అయ్యారు.