అంబులెన్స్‌ల నిలిపివేత అమానవీయం..! పాలకులకు పట్టదా..!?

చావు బతుకుల మధ్య ప్రాణం నిలుపుకునేందుకు అంబులెన్సుల్లో హైదరాబాద్ వస్తున్న రోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వం.. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు కారణం అవుతోంది. రోగులతో కూడిన అంబులెన్స్‌లను తెలంగాణలోకి రానివ్వొద్దంటూ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో.. సరిహద్దుల్లో పోలీసులు ఎక్కడివక్కడ ఆపేస్తున్నారు. దాంతో రోగుల బంధువులు పోలీసుల కాళ్లా వేళ్లా పడుతున్నారు. సరిహద్దుల్లో పరిస్థితులు చూసి.. మనసున్న ఏ ప్రజాప్రతినిధి అయినా.. ప్రభుత్వం అయినా తక్షణం స్పందించాలి. కానీ.. ఏపీ సర్కార్ మాత్రం.. సైలెంట్‌గా ఉండిపోయింది.

కానీ గుంటూరు రూరల్ ఎస్పీ మాత్రం.. మరింత అమానవీయంగా స్పందించారు. హైదరాబాద్ ఆస్పత్రిలో బెడ్ రిజర్వ్ చేసుకుని వెళ్లండి లేదా.. తెలంగాణ సర్కార్ నుంచి అనుమతి పొంది వెళ్లాలని సలహా ఇచ్చారు.. అంతే కానీ ప్రభుత్వ పెద్దలు చొరవ తీసుకుని.. తాము తెలంగాణ సర్కార్‌తో మాట్లాడతామని చెప్పలేదు. అసలు ఈ సమస్య గురించి తెలియనట్లే ప్రభుత్వం వ్యవహరించింది. అయితే ఇతర పార్టీల నేతలు మాత్రం.. ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని.. తక్షణం అక్కడి ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం మాట్లాడాలని డిమాండ్ చేశారు.

నిజానికి ప్రజాప్రతినిధులు కాకపోయినా.. ఇందులో రాజకీయం చూడకుండా.. మానవత్వం చూస్తే.. అంబులెన్స్‌లు ఆపే ప్రయత్నం చేయరని అంటున్నారు. తెలంగాణ ఆస్పత్రుల్లో బెడ్ రిజర్వ్ చేసుకున్నా.. పంపడం లేదని కొంత మంది ఆరోపిస్తున్నారు. అటు తెలంగాణ ప్రభుత్వం నిరంకుశత్వం.. ఇటు ఏపీ సర్కార్.. బాధ్యతా రాహిత్యం కలిసి. కోవిడ్ రోగుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. కనీసం మానవత్వంతో వ్యవహిరంచలేకపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

‘విద్య వాసుల అహం’ రివ్యూ: మ‌ళ్లీ పాత పెళ్లి కథే!

తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా' ప్రతి వారం ఎదో ఒక కొత్త సినిమా ఉండేలా ప్లాన్ చేస్తుకుంటుంది. ఈ వారం రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ నటించిన 'విద్య వాసుల అహం' ప్రేక్షకులు...

కడప కోర్టు తీర్పు రాజ్యాంగవిరుద్ధంగా ఉందన్న సుప్రీంకోర్టు

వివేకా హత్యపై మాట్లాడవద్దని కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు మండిపడింది. కడప కోర్టు ఉత్తర్వులు సుప్రీం తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని.. వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని స్పష్టం...

కౌంటింగ్‌లో సహకరించాలన్నట్లుగా ఈసీని బెదిరిస్తున్న సజ్జల !

అయిందేదో అయిపోయింది.. ఇక తప్పు దిద్దుకో అని ఈసీని హెచ్చరించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈసీ ఏం తప్పు చేసిందో.. ఎలా దిద్దుకోవాలనుకుంటున్నారో ఆయన పరోక్షంగానే తన మాటలతో సందేశం పంపారు. అదేమిటంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close