ఈసారి ఏ మాజీ హీరోయిన్ ని ప‌ట్టుకొస్తారో?

మ‌న‌మంతా మ‌ర్చిపోయిన‌ మాజీ హీరోయిన్ల‌ని బిజీ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులుగా మార్చేయ‌డంలో త్రివిక్ర‌మ్ దిట్ట‌. `అత్తారింటికి దారేది`లో న‌దియాని తీసుకొచ్చి, బిజీ స్టార్ గా మార్చేశాడు. అజ్ఞాత‌వాసి మిస్ ఫైర్ అయ్యింది గానీ, లేదంటే ఖుష్బూ కాల్షీట్లు ఇప్ప‌టికీ దొరికేవి కావు. బ‌ల‌మైన స్త్రీ పాత్ర‌ల్ని రాసుకోవ‌డం, వాటిని స‌మ‌ర్థులైన న‌టీమ‌ణుల‌కు అప్ప‌గించ‌డం త్రివిక్ర‌మ్ కి ఇష్టం. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నాడు త్రివిక్ర‌మ్. స్క్రిప్టు కి దాదాపుగా లాక్ ప‌డిపోయింది. ప్ర‌స్తుతం న‌టీన‌టుల ఎంపిక జ‌రుగుతోంది. ఇందులోనూ.. అత్తారింటికి దారేదిలో న‌దియా టైపు పాత్ర ఒక‌టుంద‌ని స‌మాచారం. అందుకోసం… మాజీ హీరోయిన్ల లిస్టు తీసుకుని, అందులో ఒక‌రి పేరు ఫైన‌ల్ చేసే ప‌నిలో ఉన్నాడు త్రివిక్ర‌మ్. ఈసారి… ఆ మాజీ హీరోయిన్ బాలీవుడ్ నుంచి దిగి వ‌స్తుంద‌న్న టాక్ వినిపిస్తోంది. సిమ్రాన్ పేరు కూడా చర్చ‌ల్లో ఉంద‌ని టాక్‌, ఈనెల 31న ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభిస్తారు. ఆ రోజే.. ఇత‌ర న‌టీన‌టుల వివ‌రాల్ని ఫైన‌ల్ చేసే అవ‌కాశాలున్నాయి. ఈ సినిమా టైటిల్ పై ర‌క‌రకాల వార్త‌లొస్తున్నాయి. అయితే ప్ర‌స్తుతానికి టైటిల్ అయితే ఏదీ ఫైన‌ల్ కాలేద‌ని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close