తిరుపతి రుయా ఆసుపత్రిలో కల్లోలం

కరోనా వైరస్ భారతదేశాన్ని వణికిస్తోంది. కాస్తో కూస్తో వైద్య రంగం పటిష్ఠంగా ఉన్న రాష్ట్రాలు కొంత వరకు పరిస్థితిని తట్టుకోగలుగుతూ ఉంటే అడ్మినిస్ట్రేషన్, మానిటరింగ్ సరిగ్గా లేని రాష్ట్రాలు విలయ తాండవం చూస్తున్నాయి. తాజాగా తిరుపతి రుయా ఆసుపత్రిలో జరిగిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఎంత కల్లోలంగా ఉంది అన్న దానికి అద్దం పడుతుంది. వివరాల్లోకి వెళితే.. 

తిరుపతి రుయా ఆసుపత్రిలో కోవిడ్ వార్డు అత్యవసర విభాగం లో ఆక్సిజన్ నిలిచిపోయింది. దీని వల్ల దాదాపు 10 మంది దాకా మృతి చెందగా మరో 13  మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆక్సిజన్ సరఫరా నిలిచి పోవడం పై రోగుల బంధువులు ఆందోళనకు దిగారు. సిబ్బంది నుండి ఎటువంటి సమాధానం రాక పోవడం, ఆక్సిజన్ సరఫరా పునరుద్ధరణ కాకపోవడంతో రోగుల బంధువులు ఐసియు వార్డు లోకి వెళ్లి సామాగ్రిని ధ్వంసం చేయడం ద్వారా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీంతో నర్సులు భయపడి వార్డు నుండి పారిపోయారు. వైద్యులు నర్సులు అక్కడి నుండి వెళ్లి పోవడంతో రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చనిపోయిన వారిలో పట్టుమని 30 ఏళ్ళు కూడా నిండని, ఇతరత్ర ఎటువంటి ఆరోగ్య సమస్య లేని యువకులు కూడా ఉన్నారు. మరో రెండు రోజుల్లో డిశ్చార్జి కావాల్సిన పేషెంట్స్ కూడా కేవలం ఆక్సిజన్ సరఫరా నిలిచి పోవడం వల్ల మృత్యువు ఒడి లోకి చేరుకోవాల్సి వచ్చింది. ఆందోళన పెరిగి పెద్దది కావడంతో పోలీసులు జోక్యం చేసుకోవలసి వచ్చింది. పోలీసులు రుయా ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. 

పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం, పరిస్థితిని చక్కబెట్టడం కంటే,  పరిస్థితి రాష్ట్రంలో బాగాలేదు అని వ్యాఖ్యలు చేసే వారిపై రాజకీయ కక్ష సాధింపు మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంది అన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close